ఐపీఎల్-12 వేలంలో అత్యధికంగా ధర పలికిన క్రికెటర్లు

ఐపీఎల్-12 వేలంలో అత్యధికంగా ధర పలికిన క్రికెటర్లు

Updated On : February 19, 2019 / 10:55 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 12వ సీజన్‌కు సర్వం సిద్ధమైపోయింది. ఈ మేర ముందుగా అనుకున్న షెడ్యూల్‌నే ఖరారు చేస్తూ ఐపీఎల్ మేనేజ్‌మెంట్ 17 మ్యాచ్‌ల వరకూ షెడ్యూల్‌ను ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. అయితే వివో ఐపీఎల్ 2019వ సీజన్‌ సందర్భంగా జరిగిన వేలంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆటగాళ్ల వివరాలిలా ఉన్నాయి. 

1. జయదేశ్ ఉన్‌దక్త్ రూ. 8.4 కోట్లు
2. వరుణ్ చక్రవర్తి రూ. 8.4 కోట్లు
3. శామ్ కరన్ రూ. 7.2 కోట్లు
4. కొలిన్ ఇన్‌గ్రామ్ రూ. 6.4 కోట్లు
5. కార్లొస్ బ్రాత్‌వైట్ రూ. 5 కోట్లు
6. అక్సర్ పటేల్ రూ. 5 కోట్లు
7. మోహిత్ శర్మ రూ. 5 కోట్లు
8. శివం దూబే రూ. 5 కోట్లు
9. ప్రభ్ సిమ్రాన్ రూ. 4.8 కోట్లు

ఏటా రిటైన్డ్(అంటిపెట్టుకున్న ఆటగాళ్లు) జాబితా ఉంచుకుని మిగిలిన ప్లేయర్లను వేలానికి ఉంచాలి. ఇది ఐపీఎల్‌లో రూల్. ఈ నిబంధనకు అనుగుణంగానే సీజన్‌కు ముందుగానే వేలానికి వదలిపెడుతున్న ప్లేయర్ల లిస్ట్‌ను అన్ని జట్లు మేనేజ్‌మెంట్‌కు తెలియజేశాయి. వారందరినీ వేలానికి ఉంచితే.. ఈ 8 క్రికెటర్లు అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. 

వేలం చివర్లో యువరాజ్ సింగ్ అనూహ్యంగా కనీస ధరకే అంటే కోటి రూపాయలకే ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. గత ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. సొంతగడ్డపైనే లీగ్‌లో తొలి మ్యాచ్‌ను ఆడనుంది. మార్చి 23న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఈ మ్యాచ్ జరుగుతుంది.