ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. రద్దయిన డెక్కన్ చార్జర్స్ జట్టు స్థానంలో 25 ఆక్టోబరు 2012 న కొత్తగా వచ్చిన ఈ జట్టును సన్ నెట్‍వర్క్ నిర్వహిస్తుంది. ఈ జట్టు 2016 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. అప్పుడు ఈ జట్టుకు వార్నర్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
అయితే బాల్ టాంపరింగ్ ఉదంతంలో క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ అప్పుడు ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. దీంతో వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్ టీమ్‌లోకి వచ్చాడు. కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు.
అయితే క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 13వ సీజన్ వచ్చే నెలలో ప్రారంభం కానుండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ని నియమించింది. ఈ విషయాన్ని సన్ రైజర్స్ ప్రకటనలో వెల్లడించింది. సంవత్సరంపాటు నిషేధం తర్వాత ఇటీవల ఆస్ట్రేలియా జట్టులోకి అడుగుపెట్టిన వార్నర్.. తిరిగి జట్టు పగ్గాలు అందుకున్నాడు.