ఐపీఎల్-13వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఓపెనర్లు దేవదూత్ పడిక్కల్ 56 హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు.. చివర్లో ఏబీ డివిలియర్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
ఏబీడీ 30 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లతో 51 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 90 పరుగులు జోడించారు.. ఆ తర్వాత వరుస బంతుల్లో ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు.
ఆఖరి ఓవర్ మూడో బంతికి రెండు పరుగుకోసం యత్నించే క్రమంలో డివిలియర్స్ రనౌట్ అయ్యాడు. మనీష్ పాండే వేసిన బంతిని బెయిర్‌స్టో ఏబీడీని రనౌట్ చేశాడు.
విజయ్ శంకర్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి దేవ్ దత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 12 ఓవర్ తొలి బంతికి అభిషేక్ శర్మ బౌలింగ్‌లో ఫించ్ ఎల్బీగా వెనుదిరిగాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (14), డివిలియర్స్ (51) క్రీజులో నెమ్మదిగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు.
ఇంతలో భారీ షాట్ ఆడబోయి కోహ్లీ ఔటయ్యాడు. కోహ్లీ షాట్ ఆడిన బంతిని బౌండరీ వద్ద రషీద్ ఖాన్ ఒడిచిపట్టాడు.
చివరి ఓవర్‌లో డివిలియర్స్ గేర్ మార్చి పరుగుల వర్షం కురిపించాడు. ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరో పరుగు తీసే ప్రయత్నంలో రన్ ఔట్ అయ్యాడు.
ఫలితంగా బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 163 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్, విజయ్ శంకర్, అభిషేక్ వర్మ తలో వికెట్ తీశారు.