IPL 2020, KXIP Vs RR: మయాంక్ మెరుపులు.. రాహుల్ దూకుడు.. స్కోరు 223/2

  • Published By: vamsi ,Published On : September 27, 2020 / 09:10 PM IST
IPL 2020, KXIP Vs RR: మయాంక్ మెరుపులు.. రాహుల్ దూకుడు.. స్కోరు 223/2

Updated On : September 27, 2020 / 9:15 PM IST

IPL 2020, KXIP Vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క 13వ సీజన్ యొక్క 9 వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య షార్జా మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచిన తరువాత పంజాబ్‌పై మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది



ఈ క్రమంలోనే మెరుపులు మెరిపిస్తూ మయాంక్ అగర్వాల్ అధ్భుతమైన శతకం బాదేశాడు. ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓపెనర్లు లోకేశ్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు తొలి ఓవర్ నుంచే దూకుడు మొదలుపెట్టారు. క్రీజులో కుదురుకున్నాక మయాంక్ అగర్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు.

45బంతుల్లో 9ఫోర్లు.. 7సిక్స్‌లు సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న మయాంక్.. వ్యక్తిగత స్కోరు 106పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. మరోవైపు రాహుల్ కూడా అవకాశం దొరికినప్పుడల్లా బ్యాట్ ఝళిపించాడు. వీరిద్దరి దెబ్బకు భారీ స్కోరు నమోదైంది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ రెండు వికెట్లు నష్టపోయి పంజాబ్ 223 పరుగులు చేసింది. రాహుల్ 69, మ్యాక్స్ వెల్ 13, పూరన్ 25 పరుగులు చేశారు.



రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ 26 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేయగా.. ఐపీఎల్-13వ సీజన్‌లో అగర్వాల్‌ ఈ మ్యాచ్‌లో శతకం బాదేశాడు. ఆరంభం నుంచి స్వేచ్చగా బ్యాటింగ్‌ చేస్తూ పంజాబ్‌ స్కోరును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో సీజన్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని ఈ జోడీ నమోదు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సహకారం అందిస్తుండటంతో మయాంక్‌ అలవోకగా భారీ సిక్సర్లు బాదేశాడు.