MS Dhoni Monk Avatar Pic : సన్యాసి అవతారమెత్తిన ధోనీ.. ఐపీఎల్ 2021 ముందు మిస్టర్ కూల్‌కు వైరాగ్యమా?

భారత జట్టు మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ సన్యాసి అవతారమెత్తాడు. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ కోసం ధోనీ చెన్నైకి తిరిగి వచ్చి అందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇంతలో ధోనీ సన్యాసి గెటప్ లో ఉన్న ఫొటో ఒకటి..

MS Dhoni Monk Avatar Pic : సన్యాసి అవతారమెత్తిన ధోనీ.. ఐపీఎల్ 2021 ముందు మిస్టర్ కూల్‌కు వైరాగ్యమా?

Ipl 2021 Chennai Super Kings Captain Ms Dhoni's Monk Avatar Pic Goes Viral

Updated On : March 14, 2021 / 5:05 PM IST

MS Dhoni’s monk avatar Pic: భారత జట్టు మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ సన్యాసి అవతారమెత్తాడు. ఐపీఎల్ 2021 (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ కోసం ధోనీ చెన్నైకి తిరిగి వచ్చి అందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇంతలో ధోనీ సన్యాసి గెటప్ లో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ధోనీ వైరాగ్యంతో కూర్చున్న ఫొటోని ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సన్యాసి అవతారంలో చెట్టు కొమ్మపై ధోనీ కూర్చున్న ఫొటో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎంఎ చిదంబరం స్టేడియంలో నెట్ ప్రాక్టీసు చేస్తూ కనిపించిన ధోనీ ఇలా సడన్ గా సన్యాసి అవతారంలో కనిపించడమేంటి? అని అతడి ఫ్యాన్స్ అంతా నెరెళ్లబెడుతున్నారు. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత గుండు చేయించుకొని ధోని అందరిని ఆశ్చర్యపరిచాడు.


గత ఏడాది ఐపీఎల్‌కి ముందు కూడా ధోనీ గుబురు గడ్డం, లేయర్డ్ హెయిర్‌తో కనిపించి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు సన్యాసి అవతారంలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు 39ఏళ్ల ధోనీ.. వాస్తవానికి ఒక యాడ్ షూట్ కోసమే ధోనీ ఇలా సన్యాసి గెటప్ ధరించినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ ఫొటోలో ధోనీ గుండు చేయించుకుని అచ్చం వైరాగ్యంతో కూర్చొన్న సన్యాసిలానే ఫొజిచ్చాడు. ఏది ఏమైనా.. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాదిలో కూడా ఐపీఎల్ సీజన్ మొదలుకాబోతోంది. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 (14వ ఎడిషన్‌) సీజన్ మ్యాచ్‌లు అందరిని అలరించనున్నాయి.