Ipl 2021 Csk Vs Kkr
IPL 2021 CSK Vs KKR : ఐపీఎల్ 2021 సీజన్ 2లో నేడు సిసలైన మ్యాచ్ జరిగింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 172 పరుగుల టార్గెట్ ను 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓ దశలో 142 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకున్న చెన్నై ఓటమి బాటలో పయనిస్తున్నట్టుగా కనిపించింది. అయితే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు బాది 22 పరుగులు చేశాడు. చివరి ఓవర్ లో చెన్నై విజయానికి 4 పరుగులు అవసరం కాగా, సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే చివరి బంతికి దీపక్ చహర్ సింగిల్ తీయడంతో చెన్నై విజయంతో మురిసింది.
Bank Holidays: అక్టోబరులో బ్యాంకులకు 21రోజుల పాటు సెలవులు
అంతకుముందు, లక్ష్యఛేదనలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (40), డుప్లెసిస్ (43) తొలి వికెట్ కు 8.2 ఓవర్లలో 74 పరుగులు జోడించి శుభారంభం అందించారు. వన్ డౌన్ లో వచ్చిన మొయిన్ అలీ 32 పరుగులు చేశాడు. అయితే రాయుడు (10), రైనా (11), ధోనీ (1) నిరాశపరిచారు. జడేజా విజృంభణతో చెన్నై ఓటమి ప్రమాదం తప్పించుకుంది. కోల్ కతా బౌలర్లలో నరైన్ 3, ప్రసిద్ధ్ 1, ఫెర్గుసన్ 1, వరుణ్ చక్రవర్తి 1, రస్సెల్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది.
Lock Facebook: ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఎలా?
అబుదాబి వేదికగా మ్యాచ్ జరిగింది. రాహుల్ త్రిపాఠి (45; 33 బంతుల్లో బంతుల్లో 4×4, 1×6), నితీశ్ రాణా (37; 27 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. సీఎస్కే బౌలర్లలో హేజిల్‌వుడ్, శార్దూల్ ఠాకూర్ రెండు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శుభమన్ గిల్ (9)ని రాయుడు రనౌట్ చేశాడు. తర్వాత వెంకటేశ్ అయ్యర్ (18)తో కలిసి త్రిపాఠి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. సామ్‌కరన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో త్రిపాఠి సిక్స్, ఫోర్ బాదాడు. హేజిల్ వుడ్ వేసిన తర్వాతి ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ రెండు ఫోర్లు కొట్టాడు. ఆరో ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ వెంకటేశ్ అయ్యర్‌ని ఔట్ చేసి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. తర్వాత స్కోరు వేగం కాస్త నెమ్మదించింది.
మోర్గాన్ (8) నిరాశపర్చగా.. జడేజా వేసిన 13వ ఓవర్లో త్రిపాఠి క్లీన్ బౌల్డయ్యాడు. అనంతరం రసెల్ (20; 15 బంతుల్లో 2×4, 1×6) వేగంగా ఆడబోయి 17వ ఓవర్లో ఔటయ్యాడు. దినేశ్ కార్తీక్ (26; 11 బంతుల్లో 3×4, 1×6) చివర్లో దూకుడుగా ఆడాడు. దీపక్ చహర్ వేసిన 18వ ఓవర్‌లో రాణా రెండు ఫోర్లు బాదాడు. సామ్‌కరన్ వేసిన 19వ ఓవర్లో దినేశ్ కార్తీక్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. హేజిల్‌వుడ్ వేసిన చివరి ఓవర్‌లో కార్తీక్ ఔటయ్యాడు.