IPL 2021: ఐపీఎల్‌లో ఢిల్లీ ఆటగాడికి కరోనా పాజిటివ్..

Ipl 2021 Dc Pacer Nortje Tests Positive For Covid 19
Covid-19 positive for Nortje: ఐపిఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నైపై గెలిచి ఆనందంగా ఉండగా.. కరోనా కారణంగా స్టార్ బౌలర్ మ్యాచ్‌లకు దూరం కాబోతున్నారు.
రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న రెండో మ్యాచ్‌లో అందుబాగులో ఉంటారని భావించిన జట్టు ప్రధాన పేసర్ అన్రిచ్ నోర్ట్జే(Anrich Nortje)కు కరోనా పాజిటివ్ వచ్చింది. నెగెటివ్ రిపోర్ట్‌తో భారత్‌కు వచ్చిన Anrich Nortje క్వారంటైన్‌లో ఉండగా చేయించుకున్న టెస్టులో పాజిటివ్ వచ్చింది.
దీంతో మరో 10రోజుల పాటు జట్టుకు Anrich Nortje దూరం కానున్నారు. సీజన్ ఆరంభానికి ముందే క్యాపిటల్స్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కరోనా బారినపడగా.. ఇప్పుడు మరో కీలక ఆటగాడు జట్టుకు దూరం అవ్వడం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
పాకిస్తాన్‌తో సిరీస్ తర్వాత.. సౌతాఫ్రికా ఆటగాళ్లు రబాడ, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, క్వింటన్ డికాక్ భారత్‌కు చేరుకోగా.. డికాక్ ఏడు రోజుల క్వారంటైన్ తర్వత కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ కూడా ఆడాడు.