IPL 2021 RCB Vs CSK.. చెలరేగిన బ్రావో.. చెన్నై టార్గెట్ 157 పరుగులు

ఐపీఎల్ 2021 సీజన్ 2 లో భాగంగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చే

IPL 2021 RCB Vs CSK : ఐపీఎల్ 2021 సీజన్ 2 లో భాగంగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. బెంగళూరు ఓపెనర్లు, కెప్టెన్ విరాట్ కోహ్లి, దేవ్ దత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలతో జట్టుకు శుభారంభం ఇచ్చారు. కెప్టెన్ విరాట్ కోహ్లి 41 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

దేవదత్ పడిక్కల్ ధాటిగా ఆడాడు. 50 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఓపెనర్లు శుభారంభం ఇచ్చినా ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ విఫలం అయ్యారు. దీంతో బెంగళూరు జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు వికెట్లు తీసి కోహ్లి సేన వెన్ను విరిచాడు. శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు, దీపక్ చాహర్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే చెన్నై 157 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్ లో టాస్ గెల్చిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది.

చివరల్లో చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బెంగళూరు జట్టు చివరి నాలుగు ఓవర్లలో 25 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఒకానొక సమయంలో కోహ్లి సేన 200 పరుగుల మార్క్ దాటుతుందని అంచనా వేశారు. కానీ చెన్నై బౌలర్లు కమ్ బ్యాక్ చేశారు. ముఖ్యంగా బ్రావో చెలరేగాడు. మూడు వికెట్లు తీసి బెంగళూరును దెబ్బతీశాడు.

ట్రెండింగ్ వార్తలు