IPL 2022: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రానున్నారు. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న మ్యాచ్ కు ఈ మేరకు భారీ ఎత్తులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు నెలల పాటు క్రీడాభిమానులను అలరించిన ఐపీఎల్.. టైటిల్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.

Amit Shah To Visit Telangana Praja Sangrama Yatra Public Meeting
IPL 2022: కేంద్ర హోం మంత్రి అమిత్ షా నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రానున్నారు. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న మ్యాచ్ కు ఈ మేరకు భారీ ఎత్తులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు నెలల పాటు క్రీడాభిమానులను అలరించిన ఐపీఎల్.. టైటిల్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.
ఒకవైపు గుజరాత్ టైటాన్స్ కు అరంగేట్ర సీజన్ అయినప్పటికీ లీగ్ దశలోనూ, ప్లేఆఫ్ లలోనూ ధాటిగా కనిపించింది. ఇప్పటివరకూ ఫైనల్ మ్యాచ్ ఆడలేకపోయిన రాజస్థాన రాయల్స్.. ఈ సారి సీజన్ లో దూకుడుగా ఆడింది.
ఈ రసవత్తరమైన పోరును చూసేందుకు స్టేడియానికి వస్తున్న అమిత్ షా కోసం భారీ ఎత్తులో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సిటీలో 6వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారని… అధికారులు చెప్తున్నారు.
“17మంది డీసీపీలు, 4డీఐజీలు, 28 ఏసీపీలు, 51మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, 268 సబ్ ఇన్‌స్పెక్టర్లు, 5వేల మందికి పైగా కానిస్టేబుళ్లు.. 1000మంది హోం గార్డులు, 3కంపెనీలకు చెందిన స్పెషల్ ఫోర్స్ బందోబస్త్ కోసం రానున్నారు”అహ్మదాబాద్ సిటీ కమిషనర్ సంజయ్ శ్రీవాస్తవ మీడియాతో పేర్కొన్నారు.