IPL 2022: మళ్లీ ముంబైకే టెండూల్కర్.. కాకపోతే,
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలంలో భాగంగా రెండో రోజు ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్ ను కొనుగోలు చేసింది. ఇండియా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొడుకైన అర్జున్ ను....

IPL-2022
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలంలో భాగంగా రెండో రోజు ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్ ను కొనుగోలు చేసింది. ఇండియా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొడుకైన అర్జున్ ను దక్కించుకునేందుకు గుజరాత్ టైటాన్స్ తో పోటీపడింది. ప్రారంభ ధర ముంబై ఇండియన్స్ రూ.30లక్షలకు సొంతం చేసుకుంది.
మొదటి రోజు జరిగిన వేలంలో ఇండియన్ ప్లేయర్లకు జాక్‌పాట్ తగిలింది. టీమ్ఇండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ అత్యధిక ధరను సొంతం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ అతన్ని 15కోట్ల 25లక్షలకు దక్కించుకుంది.
దీపక్ చాహర్‌ను సీఎస్కే 14 కోట్లకు దక్కించుకోగా.. శ్రేయర్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్12కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 8 కోట్ల 25 లక్షలకు ధావన్‌ను దక్కించుకుంది. రవిచంద్రన్ అశ్విన్‌ను రాజస్థాన్ రాయల్స్ 5 కోట్లకు సొంతం చేసుకుంది. పేసర్ మహ్మద్ షమీని గుజరాత్ టైటాన్స్ 6 కోట్లతో 25 లక్షలకు దక్కించుకుంది.
Read Also: రాయుడు – బ్రావో కలిసి మళ్లీ చెన్నైకే.. ఫన్నీ వీడియో రిలీజ్