IPL 2022: రాయుడు – బ్రావో కలిసి మళ్లీ చెన్నైకే.. ఫన్నీ వీడియో రిలీజ్

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అదే రేంజ్ లో డీజే బ్రావో అంటే కూడా చెన్నై జట్టే అని ప్రింట్ పడిపోయింది. అనుకున్నట్లుగానే మరోసారి..

IPL 2022: రాయుడు – బ్రావో కలిసి మళ్లీ చెన్నైకే.. ఫన్నీ వీడియో రిలీజ్

Ipl 2022 Csk

IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అదే రేంజ్ లో డీజే బ్రావో అంటే కూడా చెన్నై జట్టే అని ప్రింట్ పడిపోయింది. అనుకున్నట్లుగానే మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ వీరిద్దరినీ వేలంలో కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసింది.

బ్రావోతో కలిసి మరోసారి డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్న అంబటిరాయుడు మాట్లాడిన వీడియోను సూపర్ కింగ్స్ సోషల్ మీడియా పోస్టు చేసింది. కరేబియన్ స్టార్ బ్రావో మరోసారి జట్టులోకి వస్తుండటం తనకు చాలా సంతోషంగా ఉందని అంటున్నాడు.

‘సీఎస్కేలోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. నా పెద్ద తలనొప్పి డీజే బ్రావో తిరిగి జట్టులోకి వచ్చాడు’ అని చెప్తున్నాడు అంబటి రాయుడు. వీడియోలో రాయుడు – బ్రావో మధ్య జరిగిన స్పెషల్ మూమెంట్స్ ను పిక్చరైజ్ చేశారు.

Read Also : అందుకే, కొత్త రాజ్యాంగం కావాలి.. కారణాలు చెప్పిన కేసీఆర్

ఇంకో పోస్టులో రాయుడు, బ్రావోల స్టింట్స్ కొనసాగుతూనే ఉంటాయని కామెంట్ పెట్టారు. అంబటి రాయుడుకు రూ.6.75కోట్లు కేటాయించగా, బ్రావోను రూ.4.40కోట్లకు దక్కించుకుంది.