IPL 2022: ధోనీ లాగా దినేశ్ కార్తీక్ చాలా కూల్ అంటోన్న ఆర్సీబీ కెప్టెన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ డుప్లెసిస్.. టీమ్ మేట్ దినేశ్ కార్తీక్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ లాంటి కూల్ పర్సన్ అని పొగుడుతూనే ఫైనల్ ఓవర్లలోనూ..

IPL 2022: ధోనీ లాగా దినేశ్ కార్తీక్ చాలా కూల్ అంటోన్న ఆర్సీబీ కెప్టెన్

Duplesis

Updated On : April 1, 2022 / 7:23 AM IST

IPL 2022: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ డుప్లెసిస్.. టీమ్ మేట్ దినేశ్ కార్తీక్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ లాంటి కూల్ పర్సన్ అని పొగుడుతూనే ఫైనల్ ఓవర్లలోనూ అదే మెయింటైన్ చేయగలడనే నమ్మకాన్ని వ్యక్తపరిచాడు.

చివరి ఓవర్లలో కార్తీక్.. సిక్స్, ఫోర్ డెలివరీలు పంపడంపై బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను చేధించడం చాలా ఈజీ అయింది.

‘మ్యాచ్ చివరికి వచ్చిందనుకున్న సమయంలో దినేశ్ బాగా హెల్ప్ చేశాడు. టార్గెట్ చాలా దూరంగా ఉన్నా.. చాలా కూల్ గా ఎంఎస్ ధోనీలాగే నిలబడి స్కోరు నమోదు చేశాడు. ప్రత్యేకించి చివరి ఐదు ఓవర్లలో ‘ అని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నాడు.

Read Also: ఆర్సీబీకి పెద్ద లోటు అదే – వీరేంద్ర సెహ్వాగ్

ఐపీఎల్ 2022 సీజన్ 15 లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడిన మ్యాచ్ లో బెంగళూరు విజయం సాధించింది. టార్గెట్ చిన్నదే అయినా బెంగళూరు చెమటోడ్చాల్సి వచ్చింది. చివరకు 3 వికెట్ల తేడాతో కోల్ కతాను చిత్తు చేసింది. కోల్ కతా నిర్దేశించిన 129 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు.. మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 19.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి విక్టరీ కొట్టింది.