IPL 2022: మ్యాక్స్‌వెల్‌కు మసాజ్ చేసిన కోహ్లీ

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన రాజస్థాన్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో గెలుపొందింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ ఎగ్జైట్మెంట్ గురించి

Glenn Maxwell

IPL 2022: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన రాజస్థాన్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో గెలుపొందింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ ఎగ్జైట్మెంట్ గురించి అందరికీ తెలుసు. ఆ ఎగ్జైట్మెంట్ లోనే మ్యాక్స్‌వెల్‌కు మసాజ్ చేసేశాడు విరాట్.

ఉత్కంఠభరితమైన లక్ష్య చేధనలో ప్లేయర్లంతా డ్రెస్సింగ్ రూంలో ఉండగా మ్యాక్స్‌వెల్‌కు మసాజ్ చేస్తూ కనిపించాడు విరాట్.

బెంగళూరు ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో దినేష్ కార్తీక్ రెండో డెలివరీలో బౌండరీ బాదిన తర్వాత, డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీపై కెమెరాలు ఫోకస్ అయ్యాయి. గ్లెన్ మాక్స్‌వెల్‌ కు బ్యాక్, షోల్డర్ మసాజ్ చేస్తూ కోహ్లీ కనిపించాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఇంకొందరు మ్యాచ్ వైపే చూస్తూ కూర్చున్నారు.

Read Also: ప్లేయర్‌లా ఉన్నప్పటికీ కెప్టెన్‌లాగే ఆడతా- విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్లు తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్తాన్ పై బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

ఏప్రిల్ 9న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో RCB తదుపరి మ్యాచ్‌ ఆడనుంది.