IPL2022 Title Winner Gujarat : ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్.. తొలి సీజన్‌లోనే కప్పు నెగ్గి చరిత్ర

సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ గర్జించింది. ఐపీఎల్ 2022 సీజన్ 15 టైటిల్ విజేతగా నిలిచింది. లీగ్ లోకి అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే కప్పు అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది గుజరాత్.

IPL2022 Title Winner Gujarat : ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్.. తొలి సీజన్‌లోనే కప్పు నెగ్గి చరిత్ర

Ipl2022 Title Winner Gujarat

Updated On : May 30, 2022 / 12:01 AM IST

IPL2022 Title Winner Gujarat : సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ గర్జించింది. ఐపీఎల్ 2022 సీజన్ 15 టైటిల్ విజేతగా నిలిచింది. లీగ్ లోకి అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే కప్పు అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది గుజరాత్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది గుజరాత్.

తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. రాజస్తాన్ నిర్దేశించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ ఈజీగానే చేధించింది. 18.1 ఓవర్లలో 133 పరుగులు చేసి విజయం సాధించింది.

గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 45 పరుగులతో మెరిశాడు. బౌలింగ్ లో దుమ్మురేపిన కెప్టెన్ హార్థిక్ పాండ్యా బ్యాటింగ్ లోనే సత్తా చాటాడు. పాండ్యా 34 పరుగులు చేశాడు. మిల్లర్ 32 పరుగులు చేశాడు. దీంతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి గెలుపొందింది గుజరాత్ టైటాన్స్. రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు.

రాజస్తాన్‌ బౌలర్లు మొదట్లో గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కానీ, స్వల్ప టార్గెట్ అవడంతో గుజరాత్‌ ఈజీగా టార్గెట్ ఛేదించి టైటిల్‌ను ముద్దాడింది.