IPL 2022 : లక్నో ఫ్రాంచైజీ జెర్సీ ఇదే.. థీమ్ సాంగ్ వీడియో..!

IPL 2022 : ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టోర్నమెంట్‌కు ముందు తమ జెర్సీని ఆవిష్కరించింది.

IPL 2022 : లక్నో ఫ్రాంచైజీ జెర్సీ ఇదే.. థీమ్ సాంగ్ వీడియో..!

Ipl 2022 Lucknow Super Giants (lsg) Unveil Their Jersey Ahead Of The Tournament

Updated On : March 22, 2022 / 10:57 PM IST

IPL 2022 : ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టోర్నమెంట్‌కు ముందు తమ జెర్సీని ఆవిష్కరించింది. సంజీవ్ గోయెంకా యాజమాన్యంలోని IPL ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మంగళవారం IPL 2022లో తొలి మ్యాచ్‌కు ముందే జెర్సీని ఆవిష్కరించింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో లక్నో, గుజరాత్ జట్లు కొత్తగా చేరాయి. లక్నో సూపర్ జయింట్స్ జెర్సీ, థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. అనంతరం తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో థీమ్ సాంగ్ వీడియోను పోస్ట్ చేసింది.

ప్రముఖ భారతీయ రాపర్ ‘బాద్షా’ టైటిల్ ట్రాక్ ‘అబ్ అప్నీ బారీ హై’ థీమ్ సాంగ్ పాడారు. రెమో డిసౌజా థీమ్ సాంగ్ డైరెక్ట్ చేయడంతోపాటు కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా, కెప్టెన్ KL రాహుల్ కూడా ఉన్నారు, అతను బ్యాట్‌తో కనిపించాడు. లక్నో జెర్సీలో ఆక్వా, టీల్ షేడ్స్ కలిగి ఉంది. ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ కునాల్ రావల్ ఈ జెర్సీని రూపొందించారు. ఈ జెర్సీని చూసిన లక్నో జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

2022 IPL వేలంలో LSG రూ.59.80 కోట్లు వెచ్చించి మొత్తం 21 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 14 మంది భారతీయ ఆటగాళ్లు ఉండగా.. ఏడుగురు విదేశీయులు ఉన్నారు. LSG వేలానికి ముందు తమ జట్టులో 3 డ్రాఫ్ట్ ప్లేయర్‌లను ఎంచుకుంది. KL రాహుల్ (రూ. 17 కోట్లు), మార్కస్ స్టోయినిస్ (INR 9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (INR 4 కోట్లు). దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టన్ ఎల్‌ఎస్‌జికి ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ తొలి సీజన్‌లో జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తాడు. KL రాహుల్ నేతృత్వంలోని జట్టు మార్చి 28న ముంబైలోని వాంఖడే స్టేడియంలో IPL అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.

Read Also : IPL 2022 : లక్నో సూపర్‌జెయింట్స్‌కు భారీ షాక్.. దిగ్గజ ప్లేయర్‌ దూరం!