IPL 2023, CSK vs PBKS: ఉత్కంఠ పోరులో చెన్నై పై పంజాబ్ విజయం..Live Updates
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

CSK vs RR
IPL 2023, CSK vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ సరిగ్గా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
LIVE NEWS & UPDATES
-
పంజాబ్ విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ సరిగ్గా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరి బంతి 3 పరుగులు కావాల్సి ఉండగా సికిందర్ రజా మూడు పరుగులు తీయడంతో విజయం పంజాబ్ సొంతమైంది.
-
జితేశ్ శర్మ ఔట్
తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన జితేశ్ శర్మ బౌండరీ లైన్ వద్ద రషీద్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 186 పరుగుల(18.4వ ఓవర్) వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 19 ఓవర్లకు పంజాబ్ స్కోరు 192/6. సికిందర్ రజా(5), షారుక్‌ఖాన్(2) క్రీజులో ఉన్నారు.
-
సామ్‌కరన్ క్లీన్‌బౌల్డ్
పతిరణ బౌలింగ్‌లో సామ్ కరన్(29) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ 170 పరుగుల(17.1వ ఓవర్) వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.పతిరణ బౌలింగ్‌లో సామ్ కరన్(29) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ 170 పరుగుల(17.1వ ఓవర్) వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లకు పంజాబ్ స్కోరు 179/5. జితేశ్ శర్మ(15), షారుక్‌ఖాన్(2) క్రీజులో ఉన్నారు.
-
రెండు సిక్స్‌లు
17వ ఓవర్‌ను రవీంద్ర జడేజా వేశాడు. ఈ ఓవర్లో సామ్ కరన్, జితేశ్ శర్మలు చెరో సిక్స్ కొట్టడంతో మొత్తంగా 17 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లకు పంజాబ్ స్కోరు 170/4. సామ్ కరన్(29), జితేశ్ శర్మ(9) క్రీజులో ఉన్నారు.
-
లివింగ్‌స్టోన్ ఔట్
16వ ఓవర్‌ను తుషార్ దేశ్‌పాండే వేశాడు. ఈ ఓవర్లో లివింగ్‌స్టోన్(40) విధ్వంసం సృష్టించాడు. వరుసగా 6,6,4,6 బాదాడు. మరో భారీ షాట్‌కు యత్నించి ఆ తరువాతి బంతికే రుతురాజ్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 151 పరుగుల(15.5వ ఓవర్) వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లకు పంజాబ్ స్కోరు 153/4. సామ్ కరన్(19), జితేశ్ శర్మ(2) క్రీజులో ఉన్నారు.
-
సామ్ కరన్ ఫోర్
మహేశ్ తీక్షణ వేసిన 15వ ఓవర్లోని నాలుగో బంతికి సామ్ కరన్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు పంజాబ్ స్కోరు 129/3. లివింగ్ స్టోన్(22), సామ్ కరన్(19) క్రీజులో ఉన్నారు.
-
7 పరుగులు
పంజాబ్ బ్యాటర్లు లియామ్ లివింగ్ స్టోన్, సామ్ కరణ్ లు నిలకడగా ఆడుతున్నారు. పతిరణ వేసిన 14వ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు పంజాబ్ స్కోరు 119/3. లివింగ్ స్టోన్(21), సామ్ కరన్(13) క్రీజులో ఉన్నారు.
-
ప్రభసిమ్రాన్ సింగ్ ఔట్
పంజాబ్ మరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ప్రభసిమ్రాన్ సింగ్(42) స్టంపౌట్ అయ్యాడు. దీంతో 81 పరుగుల(8.3వ ఓవర్) వద్ద పంజాబ్ రెండో వికెట్ పడింది.
-
ప్రభసిమ్రాన్ సింగ్ ఫోర్
రవీంద్ర జడేజా వేసిన ఏడో ఓవర్లోని మూడో బంతిని ప్రభసిమ్రాన్ సింగ్ బౌండరీకి తరలించాడు. ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 7 ఓవర్లకు పంజాబ్ స్కోరు 70/1.అథర్వ తైదే(7), ప్రభసిమ్రాన్ సింగ్(33) క్రీజులో ఉన్నారు.
-
పవర్ ప్లే
పంజాబ్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. ఆరో ఓవర్‌ను మహేశ్ తీక్షణ వేయగా తొలి బంతికి ప్రభసిమ్రాన్ సింగ్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు పంజాబ్ స్కోరు 62/1.అథర్వ తైదే(5), ప్రభసిమ్రాన్ సింగ్(27) క్రీజులో ఉన్నారు.
-
ధావన్ ఔట్
తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో పతిరణ క్యాచ్ అందుకోవడంతో శిఖర్ ధావన్(28) ఔట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 50 పరుగుల(4.2వ ఓవర్) వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 5 ఓవర్లకు పంజాబ్ స్కోరు 54/1.అథర్వ తైదే(3), ప్రభసిమ్రాన్ సింగ్(21) క్రీజులో ఉన్నారు.
-
ప్రభసిమ్రాన్ సింగ్ రెండు ఫోర్లు
మహేశ్ తీక్షణ వేసిన నాలుగో ఓవర్లో ప్రభసిమ్రాన్ సింగ్ రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు పంజాబ్ స్కోరు 46/0. శిఖర్ ధావన్(24), ప్రభసిమ్రాన్ సింగ్(20) క్రీజులో ఉన్నారు.
-
దూకుడుగా ఆడుతున్న ధావన్
శిఖర్ ధావన్ దూకుడు పెంచాడు. ఆకాశ్ సింగ్ వేసిన మూడో ఓవర్లో ఓ సిక్స్, ఫోర్ కొట్టడంతో మొత్తం 14 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు పంజాబ్ స్కోరు 34/0. శిఖర్ ధావన్(21), ప్రభసిమ్రాన్ సింగ్(11) క్రీజులో ఉన్నారు.
-
ప్రభసిమ్రాన్ సింగ్ సిక్స్
రెండో ఓవర్‌ను తుషార్ దేశ్‌పాండే వేయగా మూడో బంతికి ప్రభసిమ్రాన్ సింగ్ సిక్స్ కొట్టడంతో 9 పరుగులు వచ్చాయి. 2 ఓవర్లకు పంజాబ్ స్కోరు 20/0 శిఖర్ ధావన్(9), ప్రభసిమ్రాన్ సింగ్(10) క్రీజులో ఉన్నారు.
-
శిఖర్ ధావన్ రెండు ఫోర్లు
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు పంజాబ్ జట్టు బరిలోకి దిగింది. శిఖర్ ధావన్ , ప్రభసిమ్రాన్ సింగ్ లు ఓపెనర్లుగా వచ్చాయి. తొలి ఓవర్‌ను ఆకాశ్ సింగ్ వేయగా శిఖర్ ధావన్ రెండు ఫోర్లు కొట్టాడు.
-
పంజాబ్ లక్ష్యం 201
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ డేవాన్ కాన్వే(92నాటౌట్; 52 బంతుల్లో 16 ఫోర్లు, 1సిక్స్) సెంచరీకి 8 పరుగుల దూరంలో నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్(37; 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), శివమ్ దూబే(28; 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో ధోని (13 నాటౌట్; 4 బంతుల్లో 2సిక్సర్లు) రెండు సిక్సర్లు కొట్టడంతో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మారుమోగిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, సామ్ కరన్, రాహుల్ చహర్, సికిందర్ రజాలు తలా ఓ వికెట్ తీశారు.
-
కాన్వే ఫోర్
19వ ఓవర్‌ను రబాడ వేశాడు. ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లకు చెన్నై స్కోరు 185/3. డేవాన్ కాన్వే(91), రవీంద్ర జడేజా(12) క్రీజులో ఉన్నారు.
-
8 పరుగులు
18వ ఓవర్‌ను అర్ష్‌దీప్ సింగ్ కట్టుదిట్టంగా వేశాడు. ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లకు చెన్నై స్కోరు 177/3. డేవాన్ కాన్వే(85), రవీంద్ర జడేజా(10) క్రీజులో ఉన్నారు.
-
మోయిన్ అలీ ఔట్
చెన్నై 158 పరుగుల వద్ద(16.1) మూడో వికెట్ కోల్పోయింది. రాహుల్ చహర్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన మోయిన్ అలీ స్టంపౌట్ అయ్యాడు. 17 ఓవర్లకు చెన్నై స్కోరు 169/3. డేవాన్ కాన్వే(84), రవీంద్ర జడేజా(3) క్రీజులో ఉన్నారు.
-
రెండు ఫోర్లు
16వ ఓవర్‌ను సామ్ కరణ్ వేయగా 12 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి మోయిన్ అలీ, నాలుగో బంతికి కాన్వే ఫోర్లు కొట్టారు. 16 ఓవర్లకు చెన్నై స్కోరు 158/2. డేవాన్ కాన్వే(76), మోయిన్ అలీ(10) క్రీజులో ఉన్నారు.
-
16 పరుగులు
లియామ్ లివింగ్‌స్టోన్ 15వ ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్లో కాన్వే రెండు, మోయిన్ అలీ ఓ ఫోర్ కొట్టడంతో మొత్తంగా 16 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు చెన్నై స్కోరు 146/2. డేవాన్ కాన్వే(70), మోయిన్ అలీ(5) క్రీజులో ఉన్నారు.
-
దూబే ఔట్
చెన్నై మరో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే(28) ఔట్ అయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో షారుక్‌ఖాన్ క్యాచ్ అందుకోవడంతో చెన్నై 130 పరుగుల(13.6వ ఓవర్) వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లకు చెన్నై స్కోరు 130/2. డేవాన్ కాన్వే(59), మోయిన్ అలీ (0)క్రీజులో ఉన్నారు.
-
దూబే దూకుడు
శివమ్ దూబే దూకుడుగా ఆడుతున్నాడు. 13వ ఓవర్‌ను రబాడ వేయగా తొలి బంతికి దూబే సిక్స్ బాదాడు. ఆఖరి బంతికి కాన్వే ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు చెన్నై స్కోరు 121/1. డేవాన్ కాన్వే(57), శివమ్ దూబే(22) క్రీజులో ఉన్నారు.
-
కాన్వే అర్ధశతకం
సికిందర్ రజా వేసిన పన్నెండో ఓవర్లోని తొలి బంతికి దూబే సిక్స్ కొట్టగా మూడో బంతికి కాన్వే ఫోర్ బాది 30 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లకు చెన్నై స్కోరు 107/1. డేవాన్ కాన్వే(52), శివమ్ దూబే(14) క్రీజులో ఉన్నారు.
-
4 పరుగులు
పదకొండో ఓవర్‌ను రబాడ కట్టుదిట్టంగా వేయడంతో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. 11 ఓవర్లకు చెన్నై స్కోరు 94/1. డేవాన్ కాన్వే(47), శివమ్ దూబే(6) క్రీజులో ఉన్నారు.
-
రుతురాజ్ ఔట్
సికిందర్ రజా బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్(37) స్టంపౌట్ అయ్యాడు. దీంతో 86 పరుగుల(9.4వ ఓవర్) వద్ద చెన్నై తొలి వికెట్‌ను కోల్పోయింది. 10 ఓవర్లకు చెన్నై స్కోరు 90/1. డేవాన్ కాన్వే(45), శివమ్ దూబే(4) క్రీజులో ఉన్నారు.
-
కాన్వే సిక్స్
డేవాన్ కాన్వే దూకుడుగా ఆడుతున్నాడు. రాహుల్ చహర్ వేసిన తొమ్మిదో ఓవర్లోని రెండో బంతికి సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు చెన్నై స్కోరు 77/0. డేవాన్ కాన్వే(36), రుతురాజ్ గైక్వాడ్(37) క్రీజులో ఉన్నారు.
-
కాన్వే ఫోర్
సికందర్ రజా వేసిన ఎనిమిదవ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లోని మూడో బంతికి కాన్వే ఫోర్ కొట్టాడు. 8 ఓవర్లకు చెన్నై స్కోరు 67/0. డేవాన్ కాన్వే(29), రుతురాజ్ గైక్వాడ్(34) క్రీజులో ఉన్నారు.
-
5 పరుగులు
ఏడో ఓవర్‌ను రాహుల్ చహర్ కట్టుదిట్టంగా వేయడంతో ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 7 ఓవర్లకు చెన్నై స్కోరు 62/0. డేవాన్ కాన్వే(25), రుతురాజ్ గైక్వాడ్(33) క్రీజులో ఉన్నారు.
-
మూడు ఫోర్లు
చెన్నై ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. ఆరో ఓవర్‌ను సామ్ కరన్ వేశాడు. ఈ ఓవర్లో కాన్వే రెండు, రుతురాజ్ ఓ ఫోర్ కొట్టారు. ఈ ఓవర్లో మొత్తం 16 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు చెన్నై స్కోరు 57/0. డేవాన్ కాన్వే(23), రుతురాజ్ గైక్వాడ్(30) క్రీజులో ఉన్నారు.
-
రుతురాజ్ సిక్స్
ఐదో ఓవర్‌ను రాహుల్ చహర్ వేశాడు. ఈ ఓవర్లోని ఐదో బంతికి రుతురాజ్ సిక్స్ కొట్టడంతో మొత్తంగా 9 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు చెన్నై స్కోరు 41/0. డేవాన్ కాన్వే(14), రుతురాజ్ గైక్వాడ్(24) క్రీజులో ఉన్నారు.
-
3 పరుగులు
నాలుగో ఓవర్‌ను సామ్ కరన్ కట్టుదిట్టంగా వేయడంతో ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు చెన్నై స్కోరు 32/0. డేవాన్ కాన్వే(13), రుతురాజ్ గైక్వాడ్(16) క్రీజులో ఉన్నారు.
-
మూడు ఫోర్లు
అర్ష్‌దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్లోని మొదటి, మూడో బంతిని రుతురాజ్ గైక్వాడ్ బౌండరీలుగా మలిచగా ఆఖరి బంతికి కాన్వే ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు చెన్నై స్కోరు 29/0. డేవాన్ కాన్వే(12), రుతురాజ్ గైక్వాడ్(14) క్రీజులో ఉన్నారు.
-
రెండు ఫోర్లు కొట్టిన కాన్వే
రెండో ఓవర్‌ను రబాడ వేశాడు. ఈ ఓవర్లో కాన్వే వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో మొత్తంగా 9 పరుగులు వచ్చాయి. 2 ఓవర్లకు చెన్నై స్కోరు 16/0. డేవాన్ కాన్వే(8), రుతురాజ్ గైక్వాడ్(5) క్రీజులో ఉన్నారు.
-
రెండో బంతికే రుతురాజ్ ఫోర్
టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. తొలి ఓవర్‌ను అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. రెండో బంతికి రుతురాజ్ ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.
-
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కెప్టెన్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
-
పంజాబ్ కింగ్స్ తుదిజట్టు
అథర్వ తైదే, శిఖర్ ధావన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, సికందర్ రజా, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్