IPL 2023, DC Vs RCB: బెంగ‌ళూరుపై ఢిల్లీ విజ‌యం

ఐపీఎల్ 2023 భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట్స‌ల్ విజ‌యం సాధించింది.

IPL 2023, DC Vs RCB: బెంగ‌ళూరుపై ఢిల్లీ విజ‌యం

IPL 2023

Updated On : May 6, 2023 / 10:59 PM IST

IPL 2023, DC Vs RCB: ఐపీఎల్ 2023 భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట్స‌ల్ విజ‌యం సాధించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 06 May 2023 10:59 PM (IST)

    ఢిల్లీ విజ‌యం

    ఐపీఎల్ 2023 భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట్స‌ల్ విజ‌యం సాధించింది. ఆర్‌సీబీ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 16.4 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

  • 06 May 2023 10:53 PM (IST)

    సాల్ట్ ఔట్‌

    ఢిల్లీ మ‌రో వికెట్ కోల్పోయింది. క‌ర‌ణ్ శ‌ర్మ బౌలింగ్‌లో ఫిలిప్ సాల్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 171 ప‌రుగుల(15.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. 16 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 179/3. రిలీ రోసో(28), అక్ష‌ర్ ప‌టేల్‌(6) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 10:47 PM (IST)

    7 ప‌రుగులు

    15వ‌ ఓవ‌ర్‌ను జోష్ హేజిల్‌వుడ్ వేయ‌గా 7 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 166/2. రిలీ రోసో(26), ఫిలిప్ సాల్ట్(83) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 10:41 PM (IST)

    సాల్ట్ సిక్స్‌

    14వ‌ ఓవ‌ర్‌ను వనిందు హసరంగా వేయ‌గా 9 ప‌రుగులు వ‌చ్చాయి. నాలుగో బంతికి సాల్ట్ సిక్స్ కొట్టాడు. 14 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 159/2. రిలీ రోసో(21), ఫిలిప్ సాల్ట్(82) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 10:38 PM (IST)

    24 ప‌రుగులు

    13వ ఓవ‌ర్‌ను హ‌ర్ష‌ల్ ప‌టేల్ వేయ‌గా 24 ప‌రుగులు వ‌చ్చాయి. తొలి బంతికి సాల్ట్ సిక్స్ కొట్ట‌గా రిలీ రోసో వ‌రుస‌గా 6,6,4 బాదాడు. 13 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 150/2. రిలీ రోసో(20), ఫిలిప్ సాల్ట్(74) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 10:30 PM (IST)

    3 ప‌రుగులు

    12వ ఓవ‌ర్‌ను వనిందు హసరంగా వేయ‌గా 3 ప‌రుగులు వ‌చ్చాయి. 12 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 126/2. రిలీ రోసో(4), ఫిలిప్ సాల్ట్(67) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 10:22 PM (IST)

    మిచెల్ మార్ష్ ఔట్‌

    ఢిల్లీ మ‌రో వికెట్ కోల్పోయింది. హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్‌లో మ‌హిపాల్ లోమ్రోర్ క్యాచ్ అందుకోవ‌డంతో మిచెల్ మార్ష్‌(26) ఔట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 119 ప‌రుగుల(10.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 11 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 123/2. రిలీ రోసో(4), ఫిలిప్ సాల్ట్(64) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 10:18 PM (IST)

    సిక్స్‌, ఫోర్‌

    ప‌దో ఓవ‌ర్‌ను మహిపాల్ లోమ్రోర్ వేయ‌గా 13 ప‌రుగులు వ‌చ్చాయి. రెండో బంతికి సిక్స్ కొట్టిన సాల్ట్, నాలుగో బంతికి ఫోర్ బాదాడు. 10 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 115/1. మిచెల్ మార్ష్‌(22), ఫిలిప్ సాల్ట్(64) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 10:15 PM (IST)

    ఫిలిప్ సాల్ట్ అర్ధ‌శ‌త‌కం

    తొమ్మిదో ఓవ‌ర్‌ను కరుణ్ శ‌ర్మ వేయ‌గా 16 ప‌రుగులు వ‌చ్చాయి. రెండో బంతికి ఫోర్ కొట్టిన ఫిలిప్ స్టాల్ ఆఖ‌రి బంతికి బౌండరీ బాది 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 9 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 102/1. మిచెల్ మార్ష్‌(20), ఫిలిప్ సాల్ట్(53) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 10:10 PM (IST)

    మార్ష్ ఫోర్‌

    ఎనిమిదో ఓవ‌ర్‌ను వనిందు హసరంగా వేయ‌గా 8 ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌టి బంతికి మార్ష్ ఫోర్ కొట్టాడు. 8 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 86/1. మిచెల్ మార్ష్‌(17), ఫిలిప్ సాల్ట్(44) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 10:07 PM (IST)

    సాల్ట్ ఫోర్‌

    ఏడో ఓవ‌ర్‌ను క‌రుణ్ శ‌ర్మ వేయ‌గా 8 ప‌రుగులు వ‌చ్చాయి. మూడో బంతికి సాల్ట్ ఫోర్ కొట్టాడు. 7 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 78/1. మిచెల్ మార్ష్‌(11), ఫిలిప్ సాల్ట్(42) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 09:56 PM (IST)

    వార్న‌ర్ ఔట్‌

    జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో డుప్లెసిస్ క్యాచ్ అందుకోవ‌డంతో డేవిడ్ వార్న‌ర్‌(22) ఔట్ అయ్యాడు. దీంతో 60 ప‌రుగుల(5.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఢిల్లీ మొద‌టి వికెట్ కోల్పోయింది. మిచెల్ మార్ష్ వ‌చ్చి రావ‌డంతోనే ఓ సిక్స్‌, ఫోర్ కొట్టాడు. 6 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 70/1. మిచెల్ మార్ష్‌(10), ఫిలిప్ సాల్ట్(35) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 09:54 PM (IST)

    రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌

    ఐదో ఓవ‌ర్‌ను మ‌హ్మ‌ద్ సిరాజ్ వేయ‌గా సాల్ట్ దూకుడుగా ఆడాడు. మొద‌టి మూడు బంతుల‌ను వ‌రుస‌గా 6, 6, 4 గా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 19 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 60/0. డేవిడ్ వార్న‌ర్(22), ఫిలిప్ సాల్ట్(35) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 09:48 PM (IST)

    వార్న‌ర్‌ సిక్స్‌, ఫోర్‌

    నాలుగో ఓవ‌ర్‌ను వనిందు హసరంగా వేయ‌గా 12 ప‌రుగులు వ‌చ్చాయి. తొలి బంతికి సిక్స్‌ కొట్టిన వార్న‌ర్ ఐదో బంతికి ఫోర్‌ బాదాడు. 4 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 41/0. డేవిడ్ వార్న‌ర్(21), ఫిలిప్ సాల్ట్(18) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 09:45 PM (IST)

    ఫిలిప్ సాల్ట్ ఫోర్‌, సిక్స్‌

    మూడో ఓవ‌ర్‌ను జోష్ హేజిల్‌వుడ్ వేయ‌గా 12 ప‌రుగులు వ‌చ్చాయి. తొలి బంతికి ఫోర్ కొట్టిన సాల్ట్ ఆఖ‌రి బంతికి సిక్స్ బాదాడు. 3 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 29/0. డేవిడ్ వార్న‌ర్(10), ఫిలిప్ సాల్ట్(17) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 09:39 PM (IST)

    ఫిలిప్ సాల్ట్ ఫోర్‌

    రెండో ఓవ‌ర్‌ను మాక్స్‌వెల్ వేయ‌గా 7 ప‌రుగులు వ‌చ్చాయి. ఐదో బంతికి సాల్ట్ ఫోర్ కొట్టాడు. 2 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 17/0. డేవిడ్ వార్న‌ర్(9), ఫిలిప్ సాల్ట్(6) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 09:35 PM (IST)

    వార్న‌ర్ రెండు ఫోర్లు

    ల‌క్ష్య ఛేద‌న‌కు ఢిల్లీ బ‌రిలోకి దిగింది. డేవిడ్ వార్న‌ర్, ఫిలిప్ సాల్ట్ లు ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. తొలి ఓవ‌ర్‌ను మ‌హ్మ‌ద్ సిరాజ్ వేశాడు. వార్న‌ర్ రెండు ఫోర్లు కొట్టాడు. 1 ఓవ‌ర్‌కు ఢిల్లీ స్కోరు 10/0. డేవిడ్ వార్న‌ర్(9), ఫిలిప్ సాల్ట్(1) క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 09:17 PM (IST)

    ఢిల్లీ ల‌క్ష్యం 182

    ఐపీఎల్ 2023 భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట్స‌ల్‌తో రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 181 ప‌రుగులు చేసింది. బెంగ‌ళూరు బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లి(55; 46 బంతుల్లో 5 ఫోర్లు), మహిపాల్ లోమ్రోర్(54 నాటౌట్‌; 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) లు అర్ధ‌శ‌త‌కాల‌తో మెరువ‌గా డుప్లెసిస్‌(45; 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ మార్ష్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా ముకేశ్ కుమార్, ఖ‌లీల్ అహ్మ‌ద్ చెరో వికెట్ తీశారు.

  • 06 May 2023 09:13 PM (IST)

    దినేశ్ కార్తిక్ ఔట్‌

    బెంగ‌ళూరు మ‌రో వికెట్ ను కోల్పోయింది. ఖ‌లీల్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో వార్న‌ర్ క్యాచ్ ప‌ట్ట‌డంతో దినేశ్ కార్తిక్‌(11) ఔట్ అయ్యాడు. దీంతో 172 ప‌రుగుల వ‌ద్ద బెంగ‌ళూరు నాలుగో వికెట్ కోల్పోయింది.

  • 06 May 2023 09:09 PM (IST)

    మహిపాల్ లోమ్రోర్ అర్ధ‌శ‌త‌కం

    ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో(17.3వ ఓవ‌ర్‌) ఫోర్ కొట్టి 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో మహిపాల్ లోమ్రోర్ అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 19 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 172/3. దినేశ్ కార్తిక్‌(11), మహిపాల్ లోమ్రోర్(53) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 09:01 PM (IST)

    ఫోర్‌, సిక్స్‌

    18వ‌ ఓవ‌ర్‌ను ఖ‌లీల్ అహ్మ‌ద్ వేయ‌గా 15 ప‌రుగులు వ‌చ్చాయి. మూడో బంతికి లోమ్రోర్ ఫోర్‌ కొట్టాగా ఆఖ‌రి బంతికి కార్తిక్ సిక్స్ బాదాడు. 18 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 166/3. దినేశ్ కార్తిక్‌(10), మహిపాల్ లోమ్రోర్(48) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 08:56 PM (IST)

    మహిపాల్ లోమ్రోర్ రెండు ఫోర్లు

    17వ ఓవ‌ర్‌ను ఇషాంత్ శ‌ర్మ వేయ‌గా 14 ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌టి, నాలుగో బంతికి లోమ్రోర్ ఫోర్లు కొట్టాడు. 17 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 151/3. దినేశ్ కార్తిక్‌(2), మహిపాల్ లోమ్రోర్(44) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 08:51 PM (IST)

    విరాట్ కోహ్లి ఔట్

    బెంగ‌ళూరు మ‌రో వికెట్ ను కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఖ‌లీల్ అహ్మ‌ద్ క్యాచ్ అందుకోవ‌డంతో విరాట్ కోహ్లి(55) ఔట్ అయ్యాడు. దీంతో 137 ప‌రుగుల వ‌ద్ద బెంగ‌ళూరు మూడో వికెట్ కోల్పోయింది. 16 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 137/3. దినేశ్ కార్తిక్‌(0), మహిపాల్ లోమ్రోర్(34) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 08:40 PM (IST)

    కోహ్లి అర్ధ‌శ‌త‌కం

    15వ ఓవ‌ర్‌ను మిచెల్ మార్ష్‌ వేయ‌గా 11 ప‌రుగులు వ‌చ్చాయి. రెండో బంతికి మహిపాల్ లోమ్రోర్ సిక్స్ బాదాడు. ఆఖరి బంతికి సింగిల్ తీసి కోహ్లి 42 బంతుల్లో 5 ఫోర్లతో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 126/2. విరాట్ కోహ్లి(50), మహిపాల్ లోమ్రోర్(29) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 08:36 PM (IST)

    మహిపాల్ లోమ్రోర్ ఫోర్, సిక్స్

    14వ ఓవ‌ర్‌ను కుల్దీప్ యాద‌వ్ వేయ‌గా 13 ప‌రుగులు వ‌చ్చాయి. రెండు, మూడు బంతుల‌కు మహిపాల్ లోమ్రోర్ వ‌రుస‌గా ఫోర్, సిక్స్ కొట్టాడు. 14 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 115/2. విరాట్ కోహ్లి(47), మహిపాల్ లోమ్రోర్(21) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 08:31 PM (IST)

    కోహ్లి ఫోర్‌

    13వ ఓవ‌ర్‌ను ఇషాంత్ శ‌ర్మ వేయ‌గా 9 ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌టి బంతికి కోహ్లి ఫోర్ కొట్టాడు.13 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 102/2. విరాట్ కోహ్లి(45), మహిపాల్ లోమ్రోర్(10) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 08:26 PM (IST)

    మహిపాల్ లోమ్రోర్ సిక్స్

    12వ ఓవ‌ర్‌ను కుల్‌దీప్ యాద‌వ్ వేయ‌గా 10 ప‌రుగులు వ‌చ్చాయి. నాలుగో బంతికి మహిపాల్ లోమ్రోర్ సిక్స్ బాదాడు. 12 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 93/2. విరాట్ కోహ్లి(37), మహిపాల్ లోమ్రోర్(10) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 08:22 PM (IST)

    వ‌రుస బంతుల్లో డుప్లెసిస్‌, మాక్స్‌వెల్ ఔట్‌

    ఒకే ఓవ‌ర్‌లో బెంగ‌ళూరు జ‌ట్టు రెండు వికెట్లు కోల్పోయింది. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో మూడో బంతికి భారీ షాట్ కు య‌త్నించిన డుప్లెసిస్ బౌండ‌రీ లైన్ వ‌ద్ద అక్ష‌ర్ ప‌టేల్ చేతికి చిక్క‌గా ఆ త‌రువాతి బంతికే మాక్స్‌వెల్(0) కీప‌ర్ ఫిల్ సాల్ట్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 82 ప‌రుగుల(10.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఆర్‌సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 11 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 83/2. విరాట్ కోహ్లి(36), మహిపాల్ లోమ్రోర్(1) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 08:19 PM (IST)

    డుప్లెసిస్ ఔట్‌

    మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో భారీ షాట్ కు య‌త్నించిన డుప్లెసిస్(45) బౌండ‌రీ లైన్ వ‌ద్ద అక్ష‌ర్ ప‌టేల్ చేతికి చిక్కాడు. దీంతో 82 ప‌రుగుల(10.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఆర్‌సీబీ మొద‌టి వికెట్ కోల్పోయింది.

  • 06 May 2023 08:15 PM (IST)

    7 ప‌రుగులు

    ప‌దో ఓవ‌ర్‌ను కుల్దీప్ యాద‌వ్ వేయ‌గా 7 ప‌రుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 79/0. విరాట్ కోహ్లి(35), ఫాఫ్ డుప్లెసిస్‌(44) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 08:12 PM (IST)

    డుప్లెసిస్ ఫోర్‌

    తొమ్మిదో ఓవ‌ర్‌ను అక్ష‌ర్ ప‌టేల్ వేయ‌గా 8 ప‌రుగులు వ‌చ్చాయి. ఐదో బంతికి డుప్లెసిస్ ఫోర్ కొట్టాడు. 9 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 72/0. విరాట్ కోహ్లి(33), ఫాఫ్ డుప్లెసిస్‌(39) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 08:08 PM (IST)

    కోహ్లి ఫోర్‌

    కుల్‌దీప్ యాద‌వ్ ఎనిమిదవ ఓవ‌ర్‌ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లో కోహ్లి ఓ ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా 7 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 64/0. విరాట్ కోహ్లి(31), ఫాఫ్ డుప్లెసిస్‌(33) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 08:02 PM (IST)

    6 ప‌రుగులు

    ఏడో ఓవ‌ర్‌ను మిచెల్ మార్ష్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో ఆరు ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 57/0. విరాట్ కోహ్లి(25), ఫాఫ్ డుప్లెసిస్‌(32) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 07:56 PM (IST)

    సిక్స్‌, ఫోర్‌

    బెంగ‌ళూరు ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఆరో ఓవ‌ర్‌ను ఖ‌లీల్ అహ్మ‌ద్ వేయ‌గా డుప్లెసిస్ ఓ ఫోర్‌, సిక్స్ కొట్టాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 51/0. విరాట్ కోహ్లి(22), ఫాఫ్ డుప్లెసిస్‌(29) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 07:51 PM (IST)

    డుప్లెసిస్ మూడు ఫోర్లు

    ఐదో ఓవ‌ర్‌ను ముఖేశ్ కుమార్ వేయ‌గా డుప్లెసిస్ మూడు ఫోర్లు కొట్టాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 36/0. విరాట్ కోహ్లి(19), ఫాఫ్ డుప్లెసిస్‌(17) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 07:46 PM (IST)

    విరాట్ కోహ్లి ఫోర్‌

    నాలుగో ఓవ‌ర్‌ను అక్ష‌ర్ ప‌టేల్ క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో మూడు ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 23/0. విరాట్ కోహ్లి(19), ఫాఫ్ డుప్లెసిస్‌(4) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 07:43 PM (IST)

    విరాట్ కోహ్లి ఫోర్‌

    మూడో ఓవ‌ర్‌ను ఇషాంత్ శ‌ర్మ వేశాడు. నాలుగో బంతికి విరాట్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 20/0. విరాట్ కోహ్లి(18), ఫాఫ్ డుప్లెసిస్‌(2) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 07:39 PM (IST)

    6 ప‌రుగులు

    రెండో ఓవ‌ర్‌ను అక్ష‌ర్ ప‌టేల్ వేశాడు. ఐదో బంతిని విరాట్ బౌండ‌రీకి త‌ర‌లించాడు. ఈ ఓవ‌ర్‌లో 6 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 13/0. విరాట్ కోహ్లి(12), ఫాఫ్ డుప్లెసిస్‌(1) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 07:35 PM (IST)

    కోహ్లి ఫోర్‌

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్‌లు ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగారు. తొలి ఓవ‌ర్‌ను ఖ‌లీల్ అహ్మ‌ద్ వేశాడు. రెండో బంతికి కోహ్లి ఫోర్ కొట్టాడు. 1 ఓవ‌ర్‌కు బెంగ‌ళూరు స్కోరు 7/0. విరాట్ కోహ్లి(7), ఫాఫ్ డుప్లెసిస్‌(0) లు క్రీజులో ఉన్నారు.

  • 06 May 2023 07:09 PM (IST)

    ఢిల్లీ తుది జట్టు

    డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, మనీశ్ పాండే, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

  • 06 May 2023 07:08 PM (IST)

    బెంగళూరు తుది జట్టు

    విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్.

  • 06 May 2023 07:01 PM (IST)

    బెంగళూరు బ్యాటింగ్

    టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డు ప్లెసిస్ తాము మొదట బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. తాము టాస్ గెలిచినా బ్యాటింగే తీసుకునేవారిమని ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు.