IPL 2023: పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానంలో ఏ టీమ్?.. ఆరెంజ్ క్యాప్ పోటీలో ఎవరిది ముందంజ?
ఇప్పటివరకు జరిగిన మ్యాచుల లెక్కల పరంగా రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో ఉంది. ఇక రుతురాజ్ గైక్వాడ్ అందరికన్నా ఎక్కువ స్కోరు చేశాడు.

IPL 2023
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023)లో సోమవారం వరకు మొత్తం ఆరు మ్యాచులు జరిగాయి. అన్ని జట్లూ కనీసం ఒక్కో మ్యాచు ఆడాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో 10 జట్లు ఉన్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, లఖ్ నవూ సూపర్ జెయింట్స్ ఆడుతున్నాయి.

IPL 2023 Points table
ఏ మ్యాచూ డ్రా కాలేదు. దీంతో పాయింట్ల పట్టికలో 6 జట్లు రెండేసి పాయింట్లు, మిగతా 4 జట్లు 0 పాయింట్లతో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ 3.600 నెట్ రన్ రేటుతో అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా ఓడిపోవడంతో ఆ జట్టు -3.600 నెట్ రన్ రేటుతో చివరి స్థానంలో ఉంది.
అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ (Orange) లీడర్ బోర్డులో సీఎస్కే బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఇప్పటివరకు 2 మ్యాచులు ఆడి 149 పరుగులు చేశాడు. ఎల్ఎస్జీ బ్యాటర్ మేయర్స్ 2 మ్యాచులు ఆడి 126 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.
అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇచ్చే పర్పుల్ క్యాప్ (Purple Cap) లీడర్ బోర్డులో ఎల్ఎస్జీ బౌలర్ మార్క్ వుడ్ (2 మ్యాచులు-8 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. అదే టీమ్ లోని రవి బిష్ణోయి (2 మ్యాచులు- 5 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు.
IPL Bowling records: ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు వీరే..