IPL 2024 : గిల్‌కు కోప‌మొస్తే ఎట్లుంట‌దో చూశారా..! అంపైర్‌పై సీరియస్.. వీడియో వైరల్

మైదానంలో శుభ్‌మాన్ గిల్ ఎప్పుడూ సరదాగా కనిపిస్తాడు. తోటి ప్లేయర్లను ఆటపట్టిస్తూ అల్లరిచేస్తాడు. కానీ, రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో

IPL 2024 : గిల్‌కు కోప‌మొస్తే ఎట్లుంట‌దో చూశారా..! అంపైర్‌పై సీరియస్.. వీడియో వైరల్

Shubhman Gill

RR vs GT IPL 2024 : ఐపీఎల్ – 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజేతగా నిలిచింది. అయితే, రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్ లో శుభ్‌మాన్ గిల్ ఆగ్రహానికి లోనయ్యాడు. అంపైర్ పై సీరియస్ అయ్యాడు. అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీఆర్ఎస్ కు వెళ్లాడు. అయినా, థర్డ్ అంపైర్ గందరగోళం కారణంగా గిల్ కోపం మరింత ఎక్కువైంది. దీంతో గిల్ మైదానంలోని అంపైర్ పై మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : IPL 2024 : విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్.. రెండో ప్లేస్‌లోకి దూసుకెళ్లాడు

రాజస్థాన్ రాయల్స్ ఇన్సింగ్స్ లో గుజరాత్ టైటాన్స్ తరపున 17వ ఓవర్ మోహిత్ శర్మ వేశాడు. సంజూ శాంసన్ క్రీజులో ఉన్నాడు. ఆ ఓవర్లో చివరి బంతిని వైడ్‌లైన్‌కు చాలా దగ్గర నుంచి కీపర్ చేతిలోకి వెళ్లింది. మైదానంలోని అంపైర్ దానిని వైడ్‌గా ప్రకటించాడు. అయితే, గుజరాత్ కీపర్ మాథ్యూవేడ్ ప్రకారం.. శాంసన్ ఆఫ్ స్టంప్ వెలుపల నిలబడి ఉన్నందున అది వైడ్ కాదని వాదించాడు. దీంతో శుభ్‌మాన్ గిల్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ మొదట సరైన బంతిగా ప్రకటించాడు. కానీ, కొంత సమయం తరువాత బంతిని మళ్లీ సమీక్షించారు. ఈ సమయంలో థర్డ్ అంపైర్ మోహిత్ శర్మ వేసిన బంతిని వైడ్ గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం అందరినీ గందరగోళానికి గురిచేసింది. ఈ క్రమంలో శుభ్‌మాన్ గిల్ మైదానంలోని అంపైర్ పై చాలా కోపంగా కనిపించాడు. అంపైర్ వద్దకువెళ్లి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే, చివరికి థర్డ్ అంపైర్ నిర్ణయం ప్రకారం బంతిని వైడ్ గా అంపైర్ ప్రకటించాడు.

Also Read : RR vs GT : రాజ‌స్థాన్‌కు గుజ‌రాత్ షాక్‌.. సంజూ సేన‌కు తొలి ఓట‌మి

మైదానంలో శుభ్‌మాన్ గిల్ ఎప్పుడూ సరదాగా కనిపిస్తాడు. తోటి ప్లేయర్లను ఆటపట్టిస్తూ అల్లరిచేస్తాడు. కానీ, రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో వైడ్ బాల్ విషయంలో అంపైర్ పై గిల్ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తంచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. బాబోయ్.. శుభ్‌మాన్ గిల్ కు కోపం వస్తే ఇట్లుంటదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.