IPL 2025 : ఉత్కంఠ పోరులో ముంబైపై చెన్నై విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

Courtesy BCCI

IPL 2025 : ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు గెలుపొందింది. 4 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. ముంబై నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి చేధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

చెన్నై జట్టులో ఓపెనర్ రచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ లు హాఫ్ సెంచరీలతో రాణించారు. రవీంత్ర 45 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 53 రన్స్ చేశాడు. చివర్లో రవీంద్ర జడేజా 18 బంతుల్లో 17 పరుగులతో రాణించాడు.