IPL 2025: కోల్‌కతా ఆశలపై నీళ్లు చల్లిన చెన్నై..! తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి..
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

Courtesy BCCI
IPL 2025: కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్యాన్ని మరో 2 బంతులు మిగిలి ఉండగానే సీఎస్ కే చేజ్ చేసింది. ఫలితంగా 2 వికెట్ల తేడాతో కేకేఆర్ ని చిత్తు చేసింది.
ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయిన చెన్నై.. కోల్ కతా ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సీఎస్ కే చేతిలో కేకేఆర్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలుపు ఖాయం అని ఫ్యాన్స్ అనుకున్నారు. 60 పరుగులకే సీఎస్ కే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా వెళ్లింది. అయితే డెవాల్డ్ బ్రెవిస్.. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతుల్లోనే 52 పరుగులు బాదాడు. దూబే (45) కూడా రాణించడంతో సీఎస్ కే విజయం సాధించింది. చివర్లో ధోని ధనాధన్ బ్యాటింగ్ చేశాడు.
Also Read: ప్లేఆఫ్స్ ముందు ఆర్సీబీకి భారీ దెబ్బ.. రజత్ పటీదార్ సహా నలుగురు కీలక ప్లేయర్లు ఇక ఆడరా?
సీఎస్ కే బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించాడు. ధాటిగా బ్యాటింగ్ చేశాడు. వైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్ లో 6,4,4,6,6,4 బాదాడు. ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
స్కోర్లు:
కోల్ కతా నైట్ రైడర్స్- 20 ఓవర్లలో 179/6
చెన్నై సూపర్ కింగ్స్ – 19.4 ఓవర్లలో 183/8