Kuldeep Yadav slaps Rinku Singh : రింకూ సింగ్‌ చెంప చెళ్లుమ‌నిపించిన‌ కుల్దీప్ యాద‌వ్.. ఒక్క‌సారి కాదు ఏకంగా రెండు సార్లు.. వీడియో వైర‌ల్‌..

రింకూ సింగ్‌ను కుల్దీప్ యాద‌వ్ కొట్టిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Kuldeep Yadav slaps Rinku Singh : రింకూ సింగ్‌ చెంప చెళ్లుమ‌నిపించిన‌ కుల్దీప్ యాద‌వ్.. ఒక్క‌సారి కాదు ఏకంగా రెండు సార్లు.. వీడియో వైర‌ల్‌..

Courtesy BCCI

Updated On : April 30, 2025 / 9:28 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ప్లేఆఫ్స్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై విజ‌యం సాధించింది. మంగ‌ళ‌వారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో 14 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. కాగా.. ఈ మ్యాచ్ అనంత‌రం ఢిల్లీ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్‌, కేకేఆర్ బ్యాట‌ర్ రింకూ సింగ్ ల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వైర‌ల్ అవుతున్న వీడియోలో.. మ్యాచ్ ముగిసిన త‌రువాత ఇరు జ‌ట్ల‌లోని ఆట‌గాళ్లు స‌ర‌దాగా మాట్లాడుకుంటూ క‌నిపించారు. ఈ క్ర‌మంలో కుల్దీప్ యాద‌వ్ కాస్త గ‌ట్టిగానే రింకూ సింగ్ చెంప పై బ‌లంగా కొట్టాడు. కుల్దీప్ స‌ర‌దాగా ఈ ప‌ని చేసిన‌ట్లు క‌నిపిస్తున్న‌ప్ప‌టికి అది కేకేఆర్ ఆట‌గాడు రింకూ సింగ్‌కు న‌చ్చ‌లేదు. ఈ ప‌రిణామంతో అత‌డు ఒక్క‌సారిగా షాక్ కు గురి అయ్యాడు. కోపంతో చూశాడు. అత‌డు ఏదో చెప్ప‌బోతుంటే ఆ వెంట‌నే మ‌ళ్లీ కుల్దీప్ యాద‌వ్ మ‌రోసారి రింకూ సింగ్ చెంప చెళ్లుమ‌నిపించాడు.

DC vs KKR : కేకేఆర్ చేతిలో ఓట‌మి త‌రువాత ఢిల్లీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ కామెంట్స్‌.. అందుకే ఓడిపోయాం.. అశుతోష్ ఆడుంటే..

కాగా.. రింకూ సింగ్‌ను కుల్దీప్ యాదవ్ ఎందుకు కొట్టాడో ఖ‌చ్చిత‌మైన కార‌ణం తెలియ‌దు. అత‌డు స‌ర‌దాగా కొట్టాడా లేక కావాల‌నే కొట్టాడా అన్న‌ది తెలియాల్సి ఉంది.

ఈ వీడియో వైర‌ల్ అవుతుండ‌గా కుల్దీప్ యాద‌వ్ పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఐపీఎల్ నుంచి కుల్దీప్ యాద‌వ్ ను బ్యాన్ చేయాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు. ఇంకొంద‌రు మాత్రం కుల్దీప్ యాద‌వ్ స‌ర‌గానే ఈ ప‌ని చేశాడ‌ని చెబుతున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాద‌వ్ వేసిన ఇన్నింగ్ 15 ఓవ‌ర్‌లో రింకూ సింగ్ వ‌రుస‌గా 4,2,0,6,4 ప‌రుగులు సాధించాడు. రింకూ దెబ్బ‌కు ఈ ఓవ‌ర్‌లో కుల్దీప్ యాద‌వ్ 17 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

గ‌తంలో ముంబై ఇండియన్స్ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పంజాబ్ కింగ్స్ మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌ను చెంపపై కొట్టిన సంఘటన ఎంతటి చ‌ర్చ‌నీయాంశ‌మైందో తెలిసిందే. శ్రీశాంత్ క‌న్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు స‌గ‌టు క్రికెట్ అభిమానుల‌కు ఇంకా గుర్తుండే ఉంటుంది. దీనిపై అప్పట్లో బీసీసీఐ చాలా తీవ్రంగా స్పందించింది. హ‌ర్భ‌జ‌న్ సింగ్ పై నిషేదం విధించింది. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై భ‌జ్జీ ప‌లుమార్లు స్పందించాడు. తాను అలా చేసి ఉండాల్సింది కాద‌ని చెప్పాడు.

Vaibhav Suryavanshi : వైభ‌వ్ సూర్య‌వంశీ శ‌త‌కంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చి ప‌డిందే.. ఇప్పుడెలా?