IPL 2025: ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన కొత్త కుర్రాడు.. ఎవరు ఇతడు? ఓపెనర్‌ వికెట్‌నే తీసి పడేశాడు..

అతడి వయసు 20 ఏళ్లు మాత్రమే.

IPL 2025: ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన కొత్త కుర్రాడు.. ఎవరు ఇతడు? ఓపెనర్‌ వికెట్‌నే తీసి పడేశాడు..

Vipraj Nigam ©BCCI

Updated On : March 24, 2025 / 10:06 PM IST

 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా విశాఖ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్‌ మధ్య మ్యాచ్ సోమవారం మ్యాచ్‌ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో నేటి మ్యాచులో లెగ్-స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ విప్రజ్ నిగమ్‌ను తీసుకున్నారు.

దీంతో ఈ మ్యాచుతో అతడు ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అతడి వయసు 20 ఏళ్లు మాత్రమే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన విప్రజ్ నిమగ్‌ గత ఏడాది జెడ్డాలో జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో రూ.50 లక్షలు పలికాడు.

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2024-25లో విప్రజ్ నిగమ్‌ అద్భుతంగా ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎనిమిది వికెట్లు పడగొట్టి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. రింకూ సింగ్‌తో కలిసి అద్భుతంగా ఆడాడు. కేవలం ఎనిమిది బంతుల్లో 27 పరుగులు బాదాడు.

దీంతో బ్యాటింగ్ ద్వారా కూడా ఐపీఎల్‌ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2024-25 మ్యాచులో తన జట్టు 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ఎడమచేతి వాటం లెగ్ బ్రేక్ బౌలర్.. బ్యాటింగ్‌లోనూ రాణించడంతో ఐపీఎల్‌ రూ.50 లక్షలు పలికాడు.

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విప్రజ్ తన తొలి ఓవర్‌లో 10 పరుగులు ఇచ్చి, ఐడెన్ మార్క్రామ్ వికెట్‌ను కూడా తీసుకున్నాడు. ఐపీఎల్‌లో తన మొట్టమొదటి మ్యాచులో మొత్తం 2 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చుకుని ఒక వికెట్ తీశాడు.