ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అలా జరిగితే ఆర్సీబీకి టైటిల్ ఛాన్స్ లేనట్లే.. మళ్లీ ఆ సీన్‌ రిపీట్‌ అవుతుందా..?

2023 ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ మ్యాచ్ సైతం అహ్మదాబాద్ లోనే జరిగింది. ఆ సమయంలోనూ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించింది.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అలా జరిగితే ఆర్సీబీకి టైటిల్ ఛాన్స్ లేనట్లే.. మళ్లీ ఆ సీన్‌ రిపీట్‌ అవుతుందా..?

Updated On : June 3, 2025 / 9:46 AM IST

RCB vs PBKS, IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడనున్నాయి. ఆ రెండూ తొలి కప్పు కోసం 18ఏళ్లుగా ఎదురు చూస్తుండడంతో అంతిమ సమరంపై అమితాసక్తి నెలకొంది. రెండు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తుండడంతో హోరాహోరీ సమరం ఖాయంగా కనిపిస్తోంది.

 

వర్షం పడితే..
అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం నగరంలో వర్షంపడే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే సమయంలోనూ వర్షం పడే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడితే రాత్రి 9.30గంటల వరకు ఓవర్లు కుదించకుండానే మ్యాచ్ నిర్వహిస్తారు. ఆ తరువాత ఓవర్లు కుదించి మ్యాచ్ ను నిర్వహిస్తారు. ఐదు ఓవర్ల మ్యాచ్ కు కటాఫ్ సమయం రాత్రి 11.56 గంటలుకాగా.. ఆ సమయానికి కూడా మ్యాచ్ ప్రారంభం కాకపోతే మ్యాచ్ కు రిజర్వే డే ఉంటుంది. బుధవారం సైతం వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకుంటే రెండు జట్లు సూపర్ ఓవర్ ఆడిస్తారు. సూపర్ ఓవర్ అత్యధిక పరుగులు చేసిన జట్లు ఛాంపియన్ గా నిలుస్తుంది. సూపర్ ఓవర్ కు సైతం అదనంగా 20 నిమిషాల సమయాన్ని కేటాయించారు. అంటే సూపర్ ఓవర్ రాత్రి 12.30 గంటలకు సైతం నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.


అలా జరిగితే ఆర్సీబీకి టైటిల్‌ ఛాన్స్‌ లేనట్లే..!
మంగళ, బుధవారాల్లో రెండు రోజులు అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే.. కనీసం సూపర్ ఓవర్ కూడా నిర్వహించే అవకాశం లేకపోతే మ్యాచ్ రద్దు అవుతుంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. అదే జరిగితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు విజేతగా నిలుస్తుంది.

2023లో ఏం జరిగిదంటే..
2023 ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ మ్యాచ్ సైతం అహ్మదాబాద్ లోనే జరిగింది. ఆ సమయంలోనూ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించింది. ఆ సీజన్ లో ఫైనల్ మ్యాచ్ మే 28న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కిగ్స్ జట్ల మధ్య జరిగింది. వర్షం కారణంగా ఒక్క బంతి వేయడం కూడా సాధ్యపడలేదు. టైటిల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉండడంతో ఫైనల్ ను మరుసటి రోజున నిర్వహించారు. రిజర్వ్ డే రోజున సైతం వర్షం మ్యాచ్ కు అంతరాయం కలిగింది. దీంతో మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించారు. ఆ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది.