IPL 2025 Final: ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే..

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని పంజాబ్ బౌలర్లు వమ్ము చేయలేదు.

IPL 2025 Final: ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే..

Courtesy BCCI

Updated On : June 3, 2025 / 10:15 PM IST

IPL 2025 Final: ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ ముగిసింది. కీలకమైన మ్యాచ్ లో బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. ఒక్కరు కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలబడింది లేదు, పెద్ద ఇన్నింగ్స్ ఆడింది లేదు. తొలి నుంచి పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిటంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు. ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో గెలిచి టైటిల్ విన్నర్ గా నిలవాలంటే పంజాబ్ కింగ్స్ 191 పరుగులు చేయాలి. ఫైనల్ పోరులో టాస్ నెగ్గిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.

ఆర్సీబీలో హయ్యస్ట్ స్కోర్ 43 పరుగులే. అది విరాట్ స్కోర్ చేశాడు. రజత్ పాటిదార్ 26, లివింగ్ స్టన్ 25, మయాంక్ అగర్వాల్ 24, జితేశ్ శర్మ 24
పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, జేమిసన్ సత్తా చాటారు. తలో మూడు వికెట్లు పడగొట్టారు. ఒమర్ జాయ్, వైషాక్, చాహల్ చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని పంజాబ్ బౌలర్లు వమ్ము చేయలేదు. ఆది నుంచి కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఆర్సీబీ బ్యాటర్లు స్వేచ్చగా ఆడకుండా చేశారు. క్రమంగా వికెట్లు తీస్తూ ఆర్సీబీ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు.