KKR vs SRH : వీడెవడండి బాబు.. ఒకే ఓవర్‌లో ఎడమ, కుడి చేతులతో బౌలింగ్ చేశాడు.. నువ్వు గనుక ఇండియా టీమ్‌లో ఉండిఉంటే..
అతడు వేసింది ఒకే ఒక ఓవర్ అయినప్పటికి కూడా కుడి చేతి వాటం బ్యాటర్లకు ఎడమ చేతితో, ఎడమ చేతి వాటం బ్యాటర్లకు కుడి చేతితో బంతులు వేశాడు.

Courtesy BCCI
శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడు అరుదైన బౌలర్. రెండు చేతులతోనూ అతడు బంతులు వేయగలడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగ్రేటం చేశాడు. అతడు వేసింది ఒకే ఒక ఓవర్ అయినప్పటికి కూడా కుడి చేతి వాటం బ్యాటర్లకు ఎడమ చేతితో, ఎడమ చేతి వాటం బ్యాటర్లకు కుడి చేతితో బంతులు వేశాడు. అంతేకాదండోయ్ అతడు ఓ వికెట్ సైతం పడగొట్టాడు.
ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్.. 13వ ఓవర్‌లో కమిందు మెండిస్‌కు బంతిని ఇచ్చాడు. ఈ స్టార్ ఆల్‌రౌండర్.. క్రీజులో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్‌కు కుడి చేతితో, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అంగ్క్రిష్ రఘువంశీకి ఎడమ చేతితో బంతులను వేశాడు. ఈ ఓవర్‌లోని నాలుగో బంతిని అంగ్క్రిష్ రఘువంశీని ఔట్ చేశాడు.
కమిందు తన ఐపీఎల్ అరంగ్రేటం మ్యాచ్‌లో ఒక ఓవర్ వేసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. కమిందు బౌలింగ్‌కు సంబంధించిన వీడియోను ఐపీఎల్ తన సోషల్ మీడియా పోస్ట్ చేసింది. కన్‌ప్యూజ్ అవుతున్నారా? అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. నువ్వు తోపు సామీ, నువ్వు గనుక ఇండియా టీమ్‌లో ఉండిఉంటే.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక బ్యాటింగ్‌లోనూ కమిందు ఫర్వాలేదనిపించాడు. 20 బంతులు ఎదుర్కొన్న అతడు ఓ ఫోర్, రెండు సిక్సర్లు బాది 27 పరుగులు చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేష్ అయ్యర్(60; 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), అంగ్క్రిష్ రఘువంశీ (50; 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు. రింకూ సింగ్ (32నాటౌట్; 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో షమి, కమిన్స్, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, జీషన్ అన్సారీ లు తలా ఓ వికెట్ తీశాడు.
Ishan Kishan : దేవుడా.. ఇషాన్ కిషన్ మరో హ్యారీ బ్రూక్ కాకుండా చూడు సామీ..
Left 👉 Right
Right 👉 Left
Confused? 🤔That’s what Kamindu Mendis causes in the minds of batters 😉
Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @SunRisers pic.twitter.com/IJH0N1c3kT
— IndianPremierLeague (@IPL) April 3, 2025
అనంతరం లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. దీంతో కేకేఆర్ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (33), కమింద్ మెండిస్ (27)లు రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తిలు చెరో మూడు వికెట్లు తీశారు. ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా, సునీల్ నరైన్‌లు చెరో వికెట్ సాధించారు.