IPL 2025: బ్యాటర్లూ జర భద్రం..! హెల్మెట్ సరిగా పెట్టుకోండి.. లక్నో జట్టులోకి స్పీడ్ స్టార్ వచ్చేశాడు..
లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చే వార్త ఇది. ఆ జట్టులోకి యువ పేసర్ చేరబోతున్నాడు..

Lucknow Super Giants
IPL 2025: ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ (Rishabh Pant) సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్టు తడబడుతోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు లక్నో జట్టు ఏడు మ్యాచ్ లు ఆడగా.. నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించి ఎనిమిది పాయిట్లు సాధించింది. మూడు మ్యాచ్ లలో పరాజయం పాలైంది. ఈ నెల 19న (శనివారం) రాజస్థాన్ రాయల్స్ జట్టుతో లక్నో జట్టు తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ కు ముందు లక్నో జట్టు యాజమాన్యం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Also Read: IPL 2025: సూపర్ ఓవర్ లో రాజస్థాన్ పై ఢిల్లీదే గెలుపు..
లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చే వార్త ఇది. గతేడాది ఐపీఎల్ లో స్థిరంగా 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన పేసర్ మయాంక్ యాదవ్ (Mayank Yadav). ఈ 22ఏళ్ల పేసర్ కొంతకాలంగా గాయంతో బాధపడుతూ ఐపీఎల్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం అతను పూర్తిస్థాయి ఫిట్ నెస్ సాధించడంతో తిరిగి జట్టులోకి చేరనున్నాడు. ఈనెల 19న రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ కు మయాంక్ తుది జట్టులో చేరతాడని తెలుస్తోంది. ‘మయాంక్ యాదవ్ తిరిగొచ్చాడు’ అంటూ లక్నో జట్టు అధికారిక ట్విటర్ ఖాతాలో వీడియోనుసైతం షేర్ చేసింది.
2024 ఐపీఎల్ సీజన్ లో మయాంక్ యాదవ్ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చాడు. కళ్లు చెదిరే బంతులతో బ్యాటర్లను బెంబేలెత్తించాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ లో భారత్ తరపున అరంగ్రేటం చేశాడు. ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ లు ఆడిన తరువాత గాయంతో దేశవాలీ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ పునరావాస కేంద్రంలో కోలుకున్న మయాంక్ ఈ ఐపీఎల్ లో ఆడేందుకు లక్నో జట్టుతో చేరాడు.
⚡ 𝐌𝐀𝐘𝐀𝐍𝐊 ⚡ 𝐘𝐀𝐃𝐀𝐕 ⚡ 𝐈𝐒 ⚡ 𝐁𝐀𝐂𝐊 ⚡ pic.twitter.com/c0G5p3svMA
— Lucknow Super Giants (@LucknowIPL) April 16, 2025
మయాంక్ యాదవ్ ఫిట్నెస్ పై లక్నో జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. ‘‘మయాంక్ చక్కగా పరుగెత్తుతున్నాడు. ఫిట్ గా ఉన్నాడు. భారత్ క్రికెట్ కు, ఐపీఎల్ కు ఇది శుభవార్త. ఎన్సీఏలో మయాంక్ బౌలింగ్ వీడియో చూశాను. 90 నుంచి 95శాతం మునుపటి స్థిరత్వం కనిపించింది.’’ అని పేర్కొన్నారు.