PBKS vs DC : థ‌ర్డ్ అంపైర్ పై ప్రీతి జింటా ఆగ్ర‌హం.. క‌రుణ్ నాయ‌ర్ కూడా చెప్పాడు..

ఈ సీజ‌న్‌లో అంపైరింగ్ ప్ర‌మాణాల‌పై పంజాబ్ కింగ్స్ కో ఓన‌ర్ ప్రీతి జింటా మండిప‌డింది.

PBKS vs DC : థ‌ర్డ్ అంపైర్ పై ప్రీతి జింటా ఆగ్ర‌హం.. క‌రుణ్ నాయ‌ర్ కూడా చెప్పాడు..

IPL 2025 PBKS vs DC Preity Zinta Tears Into Third Umpire Over Unacceptable Mistake

Updated On : May 25, 2025 / 3:14 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భాగంగా శ‌నివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంత‌రం ఈ సీజ‌న్‌లో అంపైరింగ్ ప్ర‌మాణాల‌పై పంజాబ్ కింగ్స్ కో ఓన‌ర్ ప్రీతి జింటా మండిప‌డింది. ఇంత టెక్నాల‌జీ అందుబాటులో ఉన్న త‌రువాత కూడా అంపైర్లు అప్పిదాలు చేయ‌డం స‌రికాదంది. థ‌ర్డ్ అంపైర్ చేసిన త‌ప్పు కార‌ణంగా త‌మ జ‌ట్టు ఓడిపోయింద‌ని తెలిపింది.

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఇది చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్‌ను ఢిల్లీ బౌల‌ర్ మోహిత్ శ‌ర్మ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఓ బంతిని పంజాబ్ బ్యాట‌ర్ భారీ షాట్ ఆడాడు. బౌండ‌రీ లైన్ వ‌ద్ద బంతిని క‌రుణ్ నాయ‌ర్‌ అద్భుతంగా అడ్డుకున్నాడు. దీంతో సిక్స‌ర్ కాస్త‌ సింగిల్ గా మారింది. అయితే.. బంతిని అందుకునే స‌మ‌యంలో క‌రుణ్ నాయ‌ర్ కాలు బౌండ‌రీ లైన్ ట‌చ్ అయింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన నాయ‌ర్ సైతం సిక్స్ అంటూ సిగ్న‌ల్ ఇచ్చాడు.

IPL 2025 : మూడు ఓవ‌ర్లు.. రూ.10.75 కోట్లు.. వార్నీ నీ ప‌నే బాగుంది క‌ద‌య్యా.. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లోనే కాస్ట్ లీ బౌల‌ర్‌..

కానీ ఫీల్డ్ అంపైర్.. థ‌ర్డ్ అంపైర్ స‌మీక్ష కోరాడు. ప‌లు కోణాల్లో రిప్లేను ప‌రిశీలించిన థ‌ర్డ్ అంపైర్.. క‌రుణ్ నాయ‌ర్ కాలు బౌండ‌రీ లైన్‌ను ట‌చ్ అయిన‌ట్లు స్ప‌ష్ట‌మైన ఆధారాలు లేక‌పోవ‌డంతో సిక్స్ కాద‌నీ, సింగిల్ అని తేల్చాడు. దీనిపైనే సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రీతి జింటా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాను క‌ర‌ణ్‌తో మాట్లాడ‌న‌ని అది సిక్స్ అని అత‌డు చెప్పిన‌ట్లు వెల్ల‌డించింది.

Shreyas iyer : శ్రేయ‌స్ అయ్య‌ర్ ఖాతాలో చెత్త రికార్డు.. ధోని బ‌చాయించాడు భ‌య్యా..