IPL 2025: పంజాబ్ పరుగుల సునామీ.. హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వీరవిహారం చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు.

Courtesy BCCI
IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ 18లో హైదరాబాద్ సన్ రైజర్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. విధ్వంసం సృష్టించారు. పరుగుల వరద పారించారు. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది పంజాబ్. ఈ మ్యాచ్ గెలవాలంటే హైదరాబాద్ 246 పరుగులు చేయాల్సి ఉంటుంది.
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వీరవిహారం చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. 36 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. చివరలో మార్కస్ స్టోయినిస్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 11 బంతుల్లో 34 పరుగులు చేశాడు.
Also Read : గుజరాత్ జైత్రయాత్రకు లక్నో బ్రేక్.. హ్యాట్రిక్ విజయం నమోదు..
చివరి ఓవర్ లో మహమ్మద్ షమీ బౌలింగ్ లో వరుసగా 4 సిక్సర్లు కొట్టాడు. ఇక ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య 36 పరుగులు, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 42 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు తీశాడు. మలింగ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లలోనే 75 పరుగులిచ్చాడు.