IPL 2025 : గుజరాత్ జైత్రయాత్రకు లక్నో బ్రేక్.. హ్యాట్రిక్ విజయం నమోదు..
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

Courtesy BCCI
IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ 18లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. గుజరాత్ కు లక్నో సూపర్ జెయింట్స్ షాక్ ఇచ్చింది. హోమ్ గ్రౌండ్ లో లక్నో చెలరేగింది. గుజరాత్ పై ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గుజరాత్ ను చిత్తు చేసింది లక్నో. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 181 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది.
లక్నో జట్టులో నికోలస్ పూరన్, ఓపెనర్ మార్క్రమ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. పూరన్ 34 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 7 సిక్సులు ఉన్నాయి. మార్క్రమ్ 31 బంతుల్లో 58 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో ఒక సిక్స్, 9 ఫోర్లు ఉన్నాయి. ఆయుష్ బదోని (28), రిషబ్ పంత్ (21) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ క్రిష్ణ 2 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.
Also Read : 30,500 మొక్కలు నాటేందుకు సాయం చేసిన చెన్నై బ్యాటర్లు.. సమాజం కోసం సీఎస్‌కే నిస్వార్థ చర్య..
ఈ సీజన్ లో వరుస విజయాలతో ఊపుమీదున్న గుజరాత్ కు లక్నో బిగ్ షాక్ ఇచ్చింది. వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన గుజరాత్.. లక్నో చేతిలో ఓటమి పాలైంది. అటు ఈ సీజన్ లో లక్నో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడిన గుజరాత్ రెండింటిలో ఓడిపోయింది.
Also Read : మీరు ఇంత సింపుల్‌గా ఉంటారా మేడం.. హైదరాబాద్‌లో ప్రీతి జింటా..
అటు 6 మ్యాచులు ఆడిన లక్నో కూడా రెండింటిలో ఓటమిపాలైంది. ఈ ఓటమితో గుజరాత్ పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. అటు లక్నో ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. నాలుగు వరుస విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానంలోకి వచ్చింది.