PBKS vs RCB : సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడిని స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. వీడియో వైరల్..
ఇంపాక్ట్ ప్లేయర్‌గా ముషీర్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ బరిలోకి దించింది

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌లో అడుగుపెట్టింది. 2016 తరువాత ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకోవడం ఆర్‌సీబీకి ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ముషీర్ ఖాన్‌ను బరిలోకి దించింది. అతడు తమ జట్టుకు మెరుగైన స్కోరు అందిస్తాడని భావించింది.
— Nihari Korma (@NihariVsKorma) May 30, 2025
కాగా.. అతడు క్రీజులోకి వచ్చి బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్నప్పుడు.. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ.. ముషీర్‌ను స్లెడ్జింగ్ చేసినట్లుగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముషీర్‌ను కోహ్లీ వాటర్ బాయ్ అని అన్నాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. పంజాబ్ ఆటగాడిని కోహ్లీ అవమానించాడని అతడిపై మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో తొలిసారి ఆడే అవకాశం వచ్చినప్పటికి ముషీర్ ఖాన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. డకౌట్ అయ్యాడు. మూడు బంతులు ఆడి సుయాశ్ శర్మ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ (26) టాప్ స్కోరర్. మిగిలిన వారిలో ప్రభ్ సిమ్రాన్ సింగ్ (18), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18)లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. జోస్ ఇంగ్లిస్ (4), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (2)లు ఘోరంగా విఫలం అయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. యశ్ దయాళ్ రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ లు తలా ఓ వికెట్ సాధించారు.
ఆ తరువాత ఫిల్ సాల్ట్ (56; 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టడంతో లక్ష్యాన్ని ఆర్‌సీబీ 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది.