IPL 2025 : రాజస్థాన్ ఘన విజయం.. ఈ సీజన్‌లో పంజాబ్‌ తొలి ఓటమి

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.

IPL 2025 : రాజస్థాన్ ఘన విజయం.. ఈ సీజన్‌లో పంజాబ్‌ తొలి ఓటమి

Courtesy BCCI

Updated On : April 5, 2025 / 11:23 PM IST

IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ 18లో మొహాలీ వేదికగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పంజాబ్ పై రాజస్థాన్ ఘన విజయం సాధించింది. 50 పరుగుల తేడాతో పంజాబ్ ని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. 206 రన్స్ భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్.. 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది.

రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 45 బంతుల్లో 67 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ (43 నాటౌట్), సంజూ శాంసన్ (38) రాణించారు.

Also Read : ఫస్ట్ టైమ్.. మ్యాచ్ చూసేందుకు స్టేడియంకి వచ్చిన ధోని తల్లిదండ్రులు.. రిటైర్‌మెంట్‌పై మళ్లీ ఊహాగానాలు..!

పంజాబ్ బ్యాటర్లలో నెహాల్ వధేరా హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అతడు 41 బంతుల్లో 62 పరుగులు చేశాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ 21 బంతుల్లో 30 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో పంజాబ్ కి ఓటమి తప్పలేదు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లతో పంజాబ్ వెన్ను విరిచాడు. సందీప్ శర్మ, మహీశ్ తీక్షణ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఈ సీజన్ లో పంజాబ్ కు ఇదే తొలి ఓటమి. గత రెండు మ్యాచుల్లో గెలుపొందిన పంజాబ్.. మూడో మ్యాచ్ లో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై, రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై గెలుపొందిన పంజాబ్ కింగ్.. మూడో మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. అటు రాజస్థాన్ కు ఇది వరుసగా రెండో విజయం. ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడిన రాజస్థాన్.. రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది, రెండింటిలో గెలుపొందింది. గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయాన్ని నమోదు చేసింది.