Courtesy BCCI
IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ 18లో ముంబై వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు గెలుపొందింది. 12 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది.
222 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 20 ఓవర్లలో 209 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైంది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. 29 బంతుల్లో 56 పరుగులు చేశాడు. హార్ధిక్ పాండ్యా 15 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా 4 వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టాడు. హేజిల్ వుడ్, యశ్ దయాల్ తలో 2 వికెట్లు తీశారు.
Also Read : రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఏ భారత క్రికెటరూ సాధించలేని ఫీట్..
ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది మూడో విజయం. నాలుగు మ్యాచుల్లో ఒకదాంట్లో ఓడింది. అటు ముంబై జట్టుకి ఈ సీజన్ లో నాలుగో పరాజయం. ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడిన ముంబై కేవలం ఒక మ్యాచ్ లోనే గెలిచింది. వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలో ముంబై చివరి స్థానంలో ఉంది.