IPL 2025 : హైదరాబాద్ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ నుంచి లక్నో నిష్క్రమణ

Courtesy BCCI
IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో ఎల్ ఎస్ జీని చిత్తు చేసింది. 206 పరుగుల టార్గెట్ ను 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
Also Read: కోహ్లీ టెస్టు రిటైర్‌మెంట్ వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా? భయపడ్డాడా?
206 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ కు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 20 బంతుల్లోనే 59 పరుగులు బాదాడు. శర్మ 6 సిక్సులు కొట్టాడు. క్లాసెన్ (47), ఇషాన్ కిషన్ (35), కమిందు మెండిస్ (32) రాణించారు. ఈ ఫలితంతో ఐపీఎల్ లో మరో జట్టు ఇంటి బాట పట్టింది. హైదరాబాద్ చేతిలో ఓటమి పాలవడంతో ఎల్ ఎస్ జీ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది.