IPL 2026 DC vs KKR : అక్కడే మ్యాచ్‌పై పట్టు కోల్పోయాం.. వారివల్లనే ఈ ఓటమి.. కెప్టెన్ అక్షర్ పటేల్ సంచలన కామెంట్స్
IPL 2026 DC vs KKR : ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై కేకేఆర్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. తమ జట్టు ఓటమికి రెండు కారణాలు అంటూ పేర్కొన్నారు.
Axar Patel key comments After the defeat against KKR team
IPL 2026 DC vs KKR : ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శుక్రవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ 14.2 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 147 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
Also Read : suryakumar yadav : సూర్య కుమార్ యాదవ్‌కు బిగ్ షాక్..! రంగంలోకి శ్రేయస్ అయ్యర్..
అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. బ్యాటింగ్ వైఫల్యంతోపాటు స్పిన్నర్ల తప్పిదాలు కూడా మా ఓటమికి కారణమయ్యాయని తెలిపారు. మేము చేసిన పరుగులే చాలా తక్కువ. రెండు, మూడు ఓవర్ల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయాం. అక్కడే మ్యాచ్‌పై పట్టు కోల్పోయామని చెప్పాడు. మా స్పిన్నర్లు కూడా కొన్ని తప్పులు చేశారు. పిచ్ స్పందించిన తీరును చూసే ఈ మాట చెబుతున్నానని అక్షర్ పేర్కొన్నారు.
ముఖ్యంగా మా బ్యాటింగ్ వైఫల్యం గురించి మేము ఖచ్చితంగా ఆలోచించాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాగే జరిగింది. మేము బాగానే ఆరంభించాం. కానీ, ఉన్నట్లుండి వరుసగా వికెట్లు కోల్పోతున్నాం. తద్వారా మ్యాచ్ పై పట్టు కోల్పోతున్నాం. దీన్ని ఏదో సంక్లిష్టమైన పద్దతుల్లో పరిష్కరించలేం. అశుతోష్, నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మేము అక్కడ పొరపాటు చేస్తే తరువాత వచ్చే బ్యాటర్ కు పరిస్థితి చాలా కష్టమవుతుందని అనుకున్నాం. కాబట్టి ఇది సరైన ఆలోచనా విధానంతో ఆడటంపై ఆధారపడి ఉంటుంది.
ఒకటి, రెండు వికెట్లు పడినా.. క్రీజులో సమయం గడుపుతూ ఆ ఒత్తిడిని అధిగమించవచ్చు. వరుసగా వికెట్లు పడుతున్నప్పుడు ఒకటి, రెండు ఓవర్లు క్రీజులో నిలబడేందుకు వినియోగించుకోవటంలో తప్పులేదు. ప్రస్తుతానికి మేము మా తప్పుల గురించి ఆలోచిస్తాం. ఆ తరువాత ఎలాగో సుదీర్ఘ ప్రయాణం ఉంది. వచ్చే ఏడాదికోసం ఎలాంటి ప్రణాళికలు వేయాలి.. ఎలాంటి దృక్పథంతో వెళ్లాలి అనే దాని గురించి ఆలోచిస్తాం అంటూ అక్షర్ చెప్పుకొచ్చాడు.
First 18 balls – 20 runs.
Next 29 balls – 80 runs.
100* (47) WITH 10 SIXES BY FINN ALLEN. 🥶 pic.twitter.com/sXFsCyrTfi
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 8, 2026
