Sai Sudharsan : వామ్మో సాయి సుదర్శన్.. నువ్వు మామూలోడివి కాదయ్యా.. క్రిస్ గేల్ రికార్డునే బ్రేక్ చేశావుగా..
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan) అరుదైన ఘనత సాధించాడు.
IPL 2026 RCB vs GT Sai Sudharsan scripted history to become Fastest to 2000 IPL runs
- ఆర్సీబీ పై శతక్కొట్టిన సాయిసుదర్శన్
- ఈ క్రమంలో అరుదైన ఘనత
- ఐపీఎల్లో 2వేల పరుగులు
- ఈ ఘనత అత్యంత వేగంగా సాధించిన ఆటగాడిగా రికార్డు
Sai Sudharsan : గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 2 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 72 పరుగుల వద్ద అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఈ క్రమంలో అతడు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. గేల్ 48 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకోగా సాయి సుదర్శన్ కేవలం 47 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.
ఐపీఎల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా ) 2000 పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* సాయి సుదర్శన్ – 47 ఇన్నింగ్స్‌లు
* క్రిస్ గేల్ – 48 ఇన్నింగ్స్‌లు
* షాన్ మార్ష్ – 52 ఇన్నింగ్స్‌లు
* రుతురాజ్ గైక్వాడ్ – 57 ఇన్నింగ్స్‌లు
* కేఎల్ రాహుల్ – 60 ఇన్నింగ్స్‌లు
బంతుల పరంగా..
ఐపీఎల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2000 వేల పరుగులు మైలురాయిని చేరుకున్న ఆటగాళ్ల జాబితాలో సాయి సుదర్శన్ ఆరో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత వీరేంద్ర సెహ్వాగ్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, యూసఫ్ పఠాన్ లు ఉన్నారు.
An Elite List 🤩
Sai Sudharsan tops this table surpassing some accomplished #TATAIPL batters 🔥
WATCH HIS INNINGS TODAY ▶️ https://t.co/7XVDIR7vO7#KhelBindaas | #RCBvGT | @gujarat_titans pic.twitter.com/dlZRfg0IAf
— IndianPremierLeague (@IPL) April 24, 2026
ఐపీఎల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2 వేల పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* అభిషేక్ శర్మ – 1193 బంతులు
* వీరేంద్ర సెహ్వాగ్ – 1211 బంతులు
* రిషబ్ పంత్ – 1306 బంతులు
* యశస్వి జైస్వాల్ – 1326 బంతులు
* యూసుఫ్ పఠాన్ – 1353 బంతులు
* సాయి సుదర్శన్ – 1361 బంతులు
ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ 58 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు.
