MS Dhoni Ruturaj Gaikwad : కీలక మ్యాచ్ ముందు భారీ ట్విస్ట్.. రుతురాజ్ ప్లేస్ లో ధోనీ.. అసలేం జరిగింది..?
MS Dhoni Ruturaj Gaikwad : గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ కు ముందు సీఎస్కే అభిమానులకు భారీ షాక్ తగిలింది.
IPL 2026 Ruturaj Gaikwad Not travelled to Chennai due to a family emergency MS Dhoni take over the captaincy
- CSK అభిమానులకు షాక్
- జట్టుని విడిచి వెళ్లిన కెప్టెన్ రుతురాజ్
- కుటంబ సమస్యల వల్ల చైన్నైకి రాని వైనం
MS Dhoni Ruturaj Gaikwad : ఐపీఎల్ 2026 లో చెన్నై సూపర్ కింగ్స్ తన ఆట తీరుతో అభిమానులను నిరాశకు గురి చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ధోనీ ఇప్పటి వరకు సీఎస్కే తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇదిగో.. అదిగో అంటున్నారు తప్పితే.. ధోనీ రాకపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే ఘన విజయం సాధించడంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. కానీ ఈలోపే వారికి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది.
ఐపీఎల్-2026లో MIపై ఘన విజయం సాధించిన CSK.. ఇప్పుడు మరో కీలక పోరుకు సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 26) చేపాక్ స్టేడియం వేదికగా.. CSK జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు చెన్నై జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కుటుంబంలో అత్యవసర ఎమర్జెన్సీ పరిస్థితుల వల్ల జట్టును వీడి.. పుణెకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అతడు తన టీమ్ తో కలిసి చెన్నైకి రాలేదు. పైగా రుతురాజ్ తిరిగి ఎప్పుడు జట్టుతో కలుస్తాడనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దీంతో ఆదివారం నాటి మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉంటే అభిమానులు మాత్రం.. రుతురాజ్ త్వరగానే తిరిగి జట్టుతో కలవాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఐపీఎల్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని CSK లెజండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆడనున్నట్లు సమాచారం. సీఎస్కే హెడ్ కోచ్ మైఖేల్ హస్సీ సైతం ధోని రీఎంట్రీపై సంకేతాలు ఇచ్చారు. పైగా CSK కెప్టెన్ రుతురాజ్ గుజరాత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే ఎంఎస్ ధోని మరోసారి జట్టు పగ్గాలు చేపట్టే అవకాశముందంటున్నారు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన సూపర్ కింగ్స్.. మూడింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
