IPL 2026 SRH vs RR Match : మేము చేసిన అతిపెద్ద తప్పు అదే.. అందుకే ఓడిపోయాం.. ఓటమిపై రియాన్ పరాగ్ కీలక కామెంట్స్..
IPL 2026 SRH vs RR Match : మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ జట్టు ఓటమికి గల కారణాలపై కీలక కామెంట్స్ చేశారు.
IPL 2026 SRH vs RR Match
- రాజస్థాన్ రాయల్స్ పై ఎస్ఆర్హెచ్ విజయం
- అతని క్యాచ్ వదలడం మా కొంపముంచింది
- ఓటమిపై ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ కీలక కామెంట్స్
IPL 2026 SRH vs RR Match : ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై విజయం సాధించింది.
Also Read : Sreesanth : చెంప దెబ్బ ఘటన.. హర్భజన్‌కు కోటి ఆదాయం.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు..
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (103) సెంచరీతో అదరగొట్టాడు. భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. దీంతో ఐదు వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ జట్టు ఓటమికి గల కారణాలపై కీలక కామెంట్స్ చేశారు.
రియాన్ మాట్లాడుతూ.. మా ఓటమి ప్రధాన కారణాలు చెత్త ఫీల్డింగ్ తోపాటు బ్యాటింగ్ లో మరో 10 నుంచి 15 పరుగులు తక్కువగా చేయడం. నైపుణ్యం పరంగా మేము బాగానే రాణించాం. మా ప్రణాళికలను బాగానే అమలు చేశాం. కానీ, చాలా క్యాచ్ లు జారవిడిచాం. తద్వారా ప్రత్యర్థి బ్యాటర్లకు మంచి అవకాశాలు లభించాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మ లాంటి డేంజరస్ బ్యాటర్ క్యాచ్‌లు వదిలేసి అవకాశం ఇస్తే ఏ మాత్రం వదిలిపెట్టరు. ఇక్కడ అదే జరిగింది.
మేము బ్యాటింగ్‌లో మరో 10 నుంచి 15 పరుగులు అదనంగా చేసి ఉండాల్సింది. కానీ, సన్‌రైజర్స్ బౌలర్లు చివరి రెండు ఓవర్లలో పరుగులు రాకుండా కట్టడి చేశారు. అద్భుతమైన యార్కర్లతో పరుగులు రాబట్టేందుకు అవకాశం ఇవ్వలేదు. మేము మరో 15 పరుగులు అదనంగా చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.
క్లాసెన్ వచ్చాక బిష్ణోయ్, జడేజాతో బౌలింగ్ చేయించాలనుకున్నా. కానీ, వికెట్ స్పిన్‌కు ఏమాత్రం సహకరించలేదు. అందుకే ఎలాగోలా నాలుగు ఓవర్లు మేనేజ్ చేయాల్సి వచ్చింది. స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తే బాగుండేది. కానీ ఈ వికెట్‌పై పేసర్లే వికెట్లు తీయాలి. స్పిన్నర్లు కేవలం రన్‌రేట్‌ను నియంత్రించాలి. అనుకున్న ప్లాన్ సరిగ్గా సాగలేదని రియాన్ అన్నారు.
ఏదిఏమైనా మేము మెరుగ్గా ఫీల్డింగ్ చేసి ఉండాల్సింది. మా ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీ ఎలా స్పందిస్తారో చూడాలి. మా పట్ల కఠినంగా వ్యవహరించరని ఆశిస్తున్నా. కానీ, ఆటలో ఫీల్డింగ్ చాలా కీలకం. తర్వాతి మ్యాచ్‌లో ఈ తప్పిదాలను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మాకు ఒకరోజు విరామం ఉంది. మానసికంగా రిప్రెష్ అయ్యి తరువాతి మ్యాచ్‌కు సిద్ధమవుతాం అని రియాన్ పరాగ్ చెప్పాడు.
