IPL 2026 : హైదరాబాద్ జైత్రయాత్ర.. రాజస్తాన్ పై ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది.
IPL 2026: ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హైదరాబాద్ ఖాతాలో మరో విజయం చేరింది. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ దుమ్మురేపింది. భారీ స్కోర్ ని ఈజీగా చేజ్ చేసి ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. 229 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేజ్ చేసింది హైదరాబాద్. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ (57), ఇషాన్ కిషన్ (74)లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. వీరిద్దరూ రాణించడంతో భారీ టార్గెట్ ను సైతం హైదరాబాద్ చేజ్ చేయగలిగింది. ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది వరుసగా నాలుగో విజయం. అటు రాజస్తాన్ కు ఈ సీజన్ లో ఇది మూడో పరాజయం.
