IPL Auction 2023: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరణ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరణ్ రికార్డు స్థాయి ధర పలికాడు. అతడిని పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర. ఇక ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ను ముంబై ఇండియన్స్ రూ.17.50 కోట్లకు, బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు, నికోలస్ పూరన్ ను లక్నో జట్టు రూ.16 కోట్లకు దక్కించుకుంది.

IPL Auction 2023: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరణ్

IPL Auction 2023

Updated On : December 23, 2022 / 4:47 PM IST

IPL Auction 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరణ్ రికార్డు స్థాయి ధర పలికాడు. అతడిని పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర. ఇక ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ను ముంబై ఇండియన్స్ రూ.17.50 కోట్లకు, బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు, నికోలస్ పూరన్ ను లక్నో జట్టు రూ.16 కోట్లకు దక్కించుకుంది.

హెర్రీ బ్రూక్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్లకు, జాసన్ హోల్డర్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.5.75 కోట్లకు దక్కించుకుంది. ఫిల్ సాల్ట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. అదే జట్టు హెన్రిచ్ క్లాసెన్ ను రూ.1.20 కోట్లకు దక్కించుకుంది. ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ ను సన్ రైజర్స్ రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది.

ఆస్ట్రేలియా క్రికెటర్ రిచర్డ్ సన్ ను ముంబై ఇండియన్స్ రూ.1.5 కోట్లకు దక్కించుకుంది. టాప్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.1.9 కోట్లకు సొంతం చేసుకుంది. ఇషాంత్ శర్మను ఢిల్లీ క్యాపిలట్స్ రూ.50 లక్షలకు దక్కించుకుంది. ఐపీఎల్ వేలం ఇంకా కొనసాగుతోంది.

Bangladesh vs India: తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 314 పరుగులకే ఆలౌట్