IPL ఫైనల్ వేదిక హైదరాబాద్ లోనే?

ఐపీఎల్ 2019 సీజన్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనున్నట్లు సమాచారం.

IPL ఫైనల్ వేదిక హైదరాబాద్ లోనే?

Updated On : April 8, 2019 / 12:26 PM IST

ఐపీఎల్ 2019 సీజన్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనున్నట్లు సమాచారం.

ఐపీఎల్ 2019 సీజన్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనున్నట్లు సమాచారం. మార్చి 23న ఆరంభమైన లీగ్ ఇప్పటికీ 21 మ్యాచ్ లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో చెన్నై చెపాక్ స్టేడియాన్ని ప్రత్యేక కారణాల రీత్యా ప్లే ఆఫ్ మ్యాచ్ లకు ఎంపిక చేశారు. ఇక తర్వాత జరగనున్న ఎలిమినేటర్.. ఫైనల్ మ్యాచ్ లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంతో పాటు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియాలను పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ అధికార ప్రతినిధి తెలిపింది. 
Read Also : 2019 వరల్డ్ కప్.. టీమిండియా జట్టు ప్రకటన ఎప్పుడంటే?

గతేడాది చాంపియన్స్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై లీగ్ లో తొలి మ్యాచ్ ను నిర్వహించిన బీసీసీఐ.. ఫైనల్ మ్యాచ్ జరగడానికి నెలరోజులు సమయం ఉండగానే కసరత్తులు మొదలుపెట్టేసింది. 

బీసీసీఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ విషయం గురించి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తో చర్చించాం. హైదరాబాద్.. బెంగళూరు స్టేడియంలు ఎలిమినేటర్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ లకు వేదికగా తీసుకోనున్నట్లు నిర్ణయించాం. మరో 2 వారాల్లో వీటిపై తుది నిర్ణయానికి వస్తాం. నలుగురు సభ్యుల కమిటీ దీని గురించి తుది తీర్పునిస్తుంది.’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 

అంతర్జాతీయ క్రికెట్ లో ధనికవంతమైన బోర్డు అయిన బీసీసీఐ భారత్ లో జరగనున్న మ్యాచ్ లకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలో పేటీఎమ్ కూడా కొత్త పెట్టుబడి దారుల జాబితాలో చేరిపోయింది.  
Read Also : ప్లే ఆఫ్ మ్యాచ్ లకు వేదికగా చెన్నై చెపాక్ స్టేడియం