ఐపీఎల్‌లో స్లెడ్జింగ్: వాట్సన్‌పై ఇషాంత్ రెచ్చిపోయాడు

ఐపీఎల్‌లో స్లెడ్జింగ్: వాట్సన్‌పై ఇషాంత్ రెచ్చిపోయాడు

Updated On : March 27, 2019 / 1:08 PM IST

బౌండరీలు.. అద్భుతమైన క్యాచ్‌లతో పాటు హెలికాప్టర్ షాట్‌లు ఐపీఎల్ అంటేనే కామన్.. వీటితో పాటు ఇప్పుడు ఐపీఎల్‌లోకి స్లెడ్జింగ్ కూడా వచ్చి చేరింది. మాన్కడే కాంట్రవర్సీ గడిచిన ఒక్కరోజు వ్యవధిలోనే ఐపీఎల్‌లో మరో సంచలనం తెరపైకి వచ్చింది. స్వదేశీ.. విదేశీ ప్లేయర్లతో జరుగుతోన్న ఐపీఎల్ లో స్లెడ్జింగ్ అంటే కచ్చితంగా విదేశీ ప్లేయర్లే అనుకుంటారు. 
Read Also : బీసీసీఐ రప్పించింది: ఐపీఎల్‌లోకి లసిత్ మలింగ

ముమ్మాటికి కానే కాదు, ఈ వివాదాన్ని ముందు లేవనెత్తింది టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మనే. షేన్‌వాట్సన్ పైకి కాలు దువ్వాడు. తొలి వికెట్ గా చెన్నై బ్యాట్స్‌మన్ అంబటి రాయుడును అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులో ఉన్న వాట్సన్ పైకి వెళ్లి చాలెంజ్ విసరబోయాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అడ్డుకోవడంతో అప్పటికీ ప్రశాంతంగా నవ్వుతూ సమాధానం చెప్పిన షేన్‌వాట్సన్ సులువుగా తప్పించుకున్నాడు.

ఆ తర్వాత కాసేపటికి మరోసారి వాట్సన్ పైకి రబాడ్ వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు కగిసో రబాడ. వాట్సన్ కూడా కొంచెం విసురుగానే కనిపించాడు. గొడవ అయ్యేలా కనిపించింది వాతావరణమంతా. కానీ, అంపైర్ కలుగజేసుకోవడంతో వ్యవహారం సద్దుమణిగింది. మ్యాచ్ ముగిసిపోయాక ఢిల్లీ జట్టు కోచ్ రిక్కీ పాంటింగ్.. రబాడ-వాట్సన్‌ల మధ్య సంభాషణ జరిగేలా చూసి వివాదానికి సంధి కుదిర్చాడు.