IPL2022 LSG Vs MI : శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. ముంబై ముందు భారీ లక్ష్యం

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. ముంబైకి 200 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది.

IPL2022 LSG Vs MI : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ముంబైకి 200 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది.

లక్నో జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. దంచికొట్టాడు. సెంచరీతో కదం తొక్కాడు. పరుగుల వరద పారించాడు. రాహుల్ 60 బంతుల్లోనే 103 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడి స్కోర్ లో 5 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. డికాక్ (24), మనీశ్ పాండే(38) రాణించారు. మార్కస్ స్టోయినిస్‌ (10), దీపక్‌ హుడా (15) పరుగులు చేశారు. కృనాల్ పాండ్య (1) నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు పడగొట్టాడు. మురుగన్ అశ్విన్, అలెన్ తలో వికెట్ తీశారు.(IPL2022 LSG Vs MI)

IPL 2022 Season 15: ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్లేనా..

ఈ సీజన్ లో ఇప్పటికే ఐదు వరుస ఓటములతో పూర్తిగా వెనుకపడిపోయింది ముంబయి ఇండియన్స్. ఇంతవరకు బోణీ కొట్టలేదు. ఆడిన 5 మ్యాచుల్లోనూ ఓడింది. ఆ జట్టు ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ఇకపై ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు లక్నో జట్టు ఐదు మ్యాచుల్లో 3 విజయాలు, 2 ఓటములతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌ నుంచైనా విజయాల బాట పట్టాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. కాగా, టీ20 లీగ్‌లో కేఎల్ రాహుల్‌కిది వందో మ్యాచ్‌.

Harbhajan Singh: “మిగిలిన వాళ్లంతా లస్సీ తాగడానికి వెళ్లారా.. “

జట్ల వివరాలు:

లక్నో : కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), డికాక్, మనీశ్‌ పాండే, దీపక్‌ హుడా, మార్కస్ స్టొయినిస్‌, ఆయుష్ బదోని, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్య, దుష్మంత చమీర, అవేశ్‌ ఖాన్, రవి బిష్ణోయ్

ముంబై : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్‌ కిషన్‌, డేవిడ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్, కీరన్ పొలార్డ్, ఫాబియన్‌ అలెన్, జయ్‌దేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, బుమ్రా, మిల్స్‌

ట్రెండింగ్ వార్తలు