Ipl2022 Srh Vs Kkr
IPL2022 SRH Vs KKR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. హైదరాబాద్ కి 176 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
IPL 2022: ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్లేనా..
కోల్ కతా బ్యాటర్లలో నితీశ్ రాణా హాఫ్ సెంచరీతో మెరిశాడు. రాణా 36 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 2 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. రసెల్ (49*), కెప్టెన్ శ్రేయస్ (28) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీశాడు. భువనేశ్వర్, జాన్సెన్, సుచిత్ తలో వికెట్ తీశారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీస్తూ కోల్‌కతా బ్యాటర్లపై ఒత్తిడి తేవడంలో హైదరాబాద్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. అయితే ఆఖర్లో ఆండ్రూ రస్సెల్ రెచ్చిపోయాడు. దూకుడుగా ఆడటంతో కోల్‌కతా మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించింది. రస్సెల్ 25 బంతుల్లోనే 49 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోర్ లో 4 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి.(IPL2022 SRH Vs KKR)
5⃣4⃣ Runs
3⃣6⃣ Balls
6⃣ Fours
2⃣ Sixes@NitishRana_27 put on an impressive show with the bat & scored a breezy half-century. ? ? #TATAIPL | #SRHvKKR | @KKRidersWatch his knock ? ?
— IndianPremierLeague (@IPL) April 15, 2022
ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గిన హైదరాబాద్ ఊపు మీదుంది. కోల్ కతా జట్టు టాప్-2లో ఉంది. హ్యాట్రిక్ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో హైదరాబాద్ ముందుకు వెళ్తుందా..? లేకపోతే మరో గెలుపు నమోదు చేసి కోల్‌కతా అగ్రస్థానానికి చేరుకుంటుందో చూడాలి.(IPL2022 SRH Vs KKR)
Harbhajan Singh: “మిగిలిన వాళ్లంతా లస్సీ తాగడానికి వెళ్లారా.. “
.@SunRisers‘ @Natarajan_91 scalped 3⃣ wickets & was our top performer from the first innings in the #TATAIPL #SRHvKKR clash. ? ?
Scorecard ▶️ https://t.co/HbO7Uh4Tcq
A look at his bowling summary ? pic.twitter.com/955CPeC5k5
— IndianPremierLeague (@IPL) April 15, 2022
జట్ల వివరాలు:
హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, మార్‌క్రమ్, శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్‌సెన్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్
కోల్‌కతా : ఆరోన్ ఫించ్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, ఆండ్రూ రస్సెల్, షెల్డన్ జాక్‌సన్, ప్యాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, అమన్ హకిమ్, వరుణ్ చక్రవర్తి
Innings Break!@NitishRana_27‘s fine fifty & @Russell12A‘s 49*-run blitz power @KKRiders to 175/8. ? ?@Natarajan_91 & Umran Malik pick 3 & 2 wickets respectively for @SunRisers. ? ?
The #SRH chase to begin soon. #TATAIPL | #SRHvKKR
Scorecard ▶️ https://t.co/HbO7Uh4Tcq pic.twitter.com/Uvosu5Y9J8
— IndianPremierLeague (@IPL) April 15, 2022