IRE vs IND 2nd T20 : భార‌త్ ఘ‌న విజ‌యం.. Updates In Telugu

మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా భార‌త్, ఐర్లాండ్ జ‌ట్లు డబ్లిన్ వేదిక‌గా రెండో టీ20 మ్యాచులో త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది.

IRE vs IND 2nd T20 : భార‌త్ ఘ‌న విజ‌యం.. Updates In Telugu

IRE vs IND 2nd T20

Updated On : August 20, 2023 / 10:58 PM IST

టీమ్ఇండియా గెలుపు

డ‌బ్లిన్ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 33 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 186 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 152 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఐరీష్ బ్యాట‌ర్ల‌లో ఆండ్రూ బల్బిర్నీ(72; 51 బంతుల్లో 5ఫోర్లు, 4 సిక్స‌ర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, ర‌వి బిష్ణోయ్, బుమ్రా తలా రెండు వికెట్లు తీయ‌గా, అర్ష్‌దీప్ సింగ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. దీంతో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ సిరీస్‌ను సొంతం చేసుకుంది.

 

కాంఫర్ ఔట్..

ఐర్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. ర‌వి బిష్ణోయ్ బౌలింగ్‌లో(9.6) కాంఫర్ (18) శివ‌మ్ దూబే చేతికి చిక్కాడు. దీంతో ఐర్లాండ్ 63 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

 

టెక్టర్ ఔట్..

ర‌వి బిష్ణోయ్ బౌలింగ్‌లో(5.2వ ఓవ‌ర్‌) టెక్టర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 28 ప‌రుగుల వ‌ద్ద ఐర్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 6 ఓవ‌ర్ల‌కు ఐర్లాండ్ స్కోరు 31/3. కర్టిస్ కాంఫర్(3), ఆండ్రూ బల్బిర్నీ(15) క్రీజులో ఉన్నారు.

 

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన ప్ర‌సిద్ధ్ కృష్ణ‌..

భారీ ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన ఐర్లాండ్‌ను ప్ర‌సిద్ధ్ కృష్ణ దెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌ను వేసిన ప్ర‌సిద్ద్ మూడో బంతికి స్టిర్లింగ్‌(0) ఆఖ‌రి బంతికి లోర్కాన్ టక్కర్(0) ఔట్ చేశాడు. దీంతో 19 ప‌రుగుల‌కే ఐర్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

 

ఐర్లాండ్ ల‌క్ష్యం 186

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 185 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రుతురాజ్ గైక్వాడ్‌(58; 43 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకోగా సంజు శాంస‌న్ (40; 26 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్‌), రింకు సింగ్‌(38; 21 బంతుల్లో 2ఫోర్లు, 3 సిక్సులు) రాణించారు. ఐర్లాండ్ బౌల‌ర్ల‌లో బారీ మెక్‌కార్తీ రెండు వికెట్లు తీయ‌గా, క్రెయిగ్ యంగ్, బెంజమిన్ వైట్, మార్క్ అడైర్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

 

రుతురాజ్ గైక్వాడ్‌ ఔట్

భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. మెక్‌కార్తీ(15.1వ ఓవ‌ర్‌)లో హ్యారీ టెక్టర్ క్యాచ్ ప‌ట్టుకోవ‌డంతో రుతురాజ్ గైక్వాడ్‌(58; 43 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్స్‌) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 129 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

 

రుతురాజ్ హాఫ్ సెంచ‌రీ

బెంజమిన్ వైట్ బౌలింగ్‌(14.3వ ఓవ‌ర్‌)లో ఫోర్ కొట్టి 39 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో రుతురాజ్ గైక్వాడ్ అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 129/3. రుతురాజ్ గైక్వాడ్‌(58), రింకూ సింగ్‌(10) క్రీజులో ఉన్నారు.

 

శాంస‌న్ క్లీన్ బౌల్డ్‌

భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న సంజు శాంస‌న్ (40; 26 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్‌) బెంజమిన్ వైట్ బౌలింగ్‌లో(12.2వ ఓవ‌ర్‌) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భార‌త్ 105 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

 

తిల‌క్ వ‌ర్మ ఔట్‌

స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో టీమ్ఇండియా రెండు వికెట్లు కోల్పోయింది. మెక్‌కార్తీ బౌలింగ్‌లో (4.1వ ఓవ‌ర్‌) డాక్రెల్ క్యాచ్ అందుకోవ‌డంతో తిల‌క్ వ‌ర్మ‌(1) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 34 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

 

య‌శ‌స్వి జైస్వాల్ ఔట్‌

టీమ్ఇండియాకు ఐర్లాండ్ బౌల‌ర్లు మొద‌టి షాక్ ఇచ్చారు. దూకుడుగా ఆడుతున్న య‌శ‌స్వి జైస్వాల్‌(18; 11 బంతుల్లో 2ఫోర్లు, 1 సిక్స్‌) ఔట్ అయ్యాడు. క్రెయిగ్ యంగ్ బౌలింగ్‌లో(3.4వ ఓవ‌ర్‌)లో కాంఫర్ క్యాచ్ అందుకోవ‌డంతో జైస్వాల్ పెవిలియ‌న్ చేరుకున్నాడు. 29 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ తొలి వికెట్ కోల్పోయింది.

 

ఐర్లాండ్ తుది జ‌ట్టు : ఆండ్రూ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్(కెప్టెన్‌), లోర్కాన్ టక్కర్(వికెట్ కీప‌ర్‌), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్

 

భారత తుది జ‌ట్టు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీప‌ర్‌), రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్‌), రవి బిష్ణోయ్

 

మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా భార‌త్, ఐర్లాండ్ జ‌ట్లు డబ్లిన్ వేదిక‌గా రెండో టీ20 మ్యాచులో త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది.