Shikha Pandey: “మహిళల క్రికెట్ బోరింగ్ అనిపిస్తే తల ఇసుకలో పెట్టండి”
ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ ప్లేయర్ కమ్ ఎయిర్‌ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ అయిన శిఖా పాండే సోషల్ మీడియా వేదికగా ఘాటైన కామెంట్ చేశారు. ఉమెన్ క్రికెట్ బోరింగ్ గా ఫీలయ్యే వాళ్లను అందులో..

Shikha Pandey
Shikha Pandey: ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ ప్లేయర్ కమ్ ఎయిర్‌ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ అయిన శిఖా పాండే సోషల్ మీడియా వేదికగా ఘాటైన కామెంట్ చేశారు. ఉమెన్ క్రికెట్ బోరింగ్ గా ఫీలయ్యే వాళ్లను అందులో తిట్టిపోశారు.
‘ఇంకా ఉమెన్ క్రికెట్ బోర్ గా ఫీలయ్యే వాళ్లు ఉంటే.. క్లియర్ గా చెబుతున్నా. వాళ్లు క్రికెట్ చూడకుండా తలను ఇసుకలో పెట్టుకోండి. ఇది కేవలం ఆటలను బోర్ గా ఫీలయ్యే వాళ్లకు మాత్రమే. మహిళలు ఎప్పుడైతే గ్రౌండ్ లో దిగుతారో.. ఆ గేమ్‌ని చూడటం లేదా అమ్మాయి శక్తిని అభినందించడం, గుర్తించడం ఇష్టం లేని వాళ్లే ఇలా చేస్తారు’ అని కామెంట్ చేశారు.
ఆమె ట్విట్టర్ లో చేసిన పోస్టుకు మంచి స్పందన వచ్చింది. ఫొటోలతో, వీడియోలతో ఆమెకు రిప్లై ఇస్తున్నారు. తాము మహిళల క్రికెట్ చూస్తున్నామంటూ , కొందరు మహిళా కుటుంబ సభ్యులతో కలిసి ఆడిన వీడియోలను పోస్టు చేస్తున్నారు.
Read Also: టీ20 క్రికెట్‌లో ధోని రికార్డును బద్దలు కొట్టిన మహిళా క్రికెటర్
ఓ మహిళ తన చిన్నారితో క్రికెట్ ఆడుతున్న వీడియోను పోస్టు చేసింది.