Sri Lanka Tour of India: మళ్ళీ జట్టులోకి జస్ప్రిత్ బుమ్రా.. శ్రీలంకతో వన్డే సిరీస్ స్క్వాడ్‌లో మార్పులు
శ్రీలంకతో ఈ నెల 10 నుంచి జరిగే వన్డే సిరీస్ కు భారత జట్టులో పలు మార్పులు చేస్తూ టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది బీసీసీఐ. స్వాడ్ లో పేసర్ జస్ప్రిత్ బుమ్రాను కూడా చేర్చుతున్నట్లు ఇవాళ ప్రకటించింది. ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెప్పింది.

Sri Lanka Tour of India
Sri Lanka Tour of India: శ్రీలంకతో ఈ నెల 10 నుంచి జరిగే వన్డే సిరీస్ కు భారత జట్టులో పలు మార్పులు చేస్తూ టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది బీసీసీఐ. స్వాడ్ లో పేసర్ జస్ప్రిత్ బుమ్రాను కూడా చేర్చుతున్నట్లు ఇవాళ ప్రకటించింది. ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెప్పింది.
గత ఏడాది సెప్టెంబరు నుంచి బుమ్రా అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడలేదు. వెన్నెముక గాయం కారణంగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నుంచి కూడా అతడు వైదొలిగాడు. అనంతరం చికిత్స తీసుకున్నాడు. అతడు ప్రస్తుతం ఫిట్ గా ఉన్నాడని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ప్రకటించింది. దీంతో టీమిండియా స్క్వాడ్ లో అతడు త్వరలోనే చేరతాడని బీసీసీఐ తెలిపింది. కాగా, ఇవాళ రాత్రి 7 గంటల నుంచి టీమిండియా-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
తాజాపర్చిన టీమిండియా వన్డే స్క్వాడ్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్.
VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. ద్రావిడ్ పదవీ కాలం ముగిసిన తర్వాత నియామకం