Jasprit Bumrah Trolled : ముందు నువ్వు పాటించి మాకు చెప్పు.. బుమ్రాపై నెటిజన్ల ట్రోలింగ్!

టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. బుమ్రా తన పెళ్లి రిసెప్షన్ ఫొటోలను షేర్ చేసిన తర్వాత ఒక్కసారిగా ట్రోలింగ్ మొదలైంది. అందుకు అతడి ఫొటోలే కారణం..

Jasprit Bumrah Trolled : ముందు నువ్వు పాటించి మాకు చెప్పు.. బుమ్రాపై నెటిజన్ల ట్రోలింగ్!

Jasprit Bumrah Trolled After Spot Crackers

Updated On : March 20, 2021 / 7:07 PM IST

Jasprit Bumrah Trolled After Spot Crackers : టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. బుమ్రా తన పెళ్లి రిసెప్షన్ ఫొటోలను షేర్ చేసిన తర్వాత ఒక్కసారిగా ట్రోలింగ్ మొదలైంది. అందుకు అతడి ఫొటోలే కారణం.. స్పోర్ట్స్ వ్యాఖ్యాత సంజనా గనేశన్‌తో బుమ్రాకు ఈ నెల 15న వివాహమైన సంగతి తెలిసిందే. కరోనా ఆంక్షల మధ్య కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో గోవాలో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అప్పటివరకూ సీక్రెట్‌గా ఉంచిన బుమ్రా.. తన పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.


సంజనతో తో వివాహ వేడుకలో దిగిన రెండు ఫొటోలను బుమ్రా ట్విటర్‌లో పోస్టు చేశాడు. పెళ్లి జీవితం చాలా అద్భుతంగా ఉందని అన్నాడు. దీవించిన, శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు. బుమ్రా పంచుకున్న ఫొటోల్లో బాణసంచా కాల్చడం కనిపించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.


దీపావళి రోజున టపాసులు కాల్చొద్దని గతంలో బుమ్రా అభిమానులను కోరుతూ ట్వీట్‌ చేశాడు. 2017లో బుమ్రా చేసిన ట్వీట్‌ను ఇప్పుడు నెటిజన్లు షేర్‌ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ముందు మీరు పాటించి తర్వాత ఇతరులకు చెప్పండంటూ బుమ్రాను ఏకిపారేస్తున్నారు.