Tokyo Olympics : ఒలింపిక్ చరిత్రలో తొలిసారి..అన్నాచెల్లెళ్ళకు పసిడి పతకాలు

ఒలింపిక్ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఒకే రోజు అన్నాచెల్లెలు బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించారు. ఒలింపిక్ చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు.

Judoka Abe Siblings : ఒలింపిక్ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఒకే రోజు అన్నాచెల్లెళ్లు బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించారు. ఒలింపిక్ చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు. వీరు పాల్గొన్న తొలి ఒలింపిక్స్ లోనే ఏకంగా పసిడి పతాకాన్ని తమ ఖాతాల్లో వేసుకున్నారు. వీరు జపాన్ దేశానికి చెందిన వారు. ఆదివారం జరిగిన జూడో పోటీల్లో ఈ పతకాలు సాధించారు.

Read More : MAA Elections: ఈసీతో కార్యనిర్వాహక కమిటీ భేటీ.. ఎన్నికలపై క్లారిటీ వచ్చేనా?

21 ఏళ్ల ఉటా అబే, ఈమె సోదరుడు 23 ఏళ్ల హిపుమి అంబే ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం 52 కేజీల మహిళల కేటగిరిలో ఉటా …66 కేజీల పురుషుల కేటగిరీలో హిపుమి పోటీ పడ్డారు. ఫ్రాన్స్ కు చెందిన అమండైన్ బుచర్డ్ పై ఉటా విజయం సాధించి స్వర్ణ పతకం సాధించారు. అంతకు కొన్ని గంటల ముందు…జార్జియాకు చెందిన వాజా మార్గ్వెలాష్విలితో హిపుమి పోటీ పడ్డారు. ఇందులో హిపుమి విజయం సాధించి స్వర్ణ పతకాన్ని మెడలో వేసుకున్నారు.

Read More :Web Series – Family Man: ఫ్యామిలీ మ్యాన్.. మీర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్‌లు పోర్న్‌లే – సునీల్ పాల్

ఇద్దరు అన్నాచెల్లెళ్లు తాము పాల్గొన్న తొలి ఒలింపిక్స్ లో విజయం సాధించడం..అందులో స్వర్ణ పతకం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలియచేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఒలింపిక్ పోటీల్లో జపాన్ ఐదు స్వర్ణపతకాలు సాధించినట్లైంది. మొత్తంగా ఐదు స్వర్ణాలు, ఓ రజతం (6 పతకాలు) సాధించింది జపాన్.

ట్రెండింగ్ వార్తలు