ENG vs IND : ఐదో టెస్టులో క్రిస్‌వోక్స్ ఒంటి చేత్తో బ్యాటింగ్ చేస్తాడా? 1986లో సలీం మాలిక్ ఇలాగే..
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్ ,ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.

Just like Saleem Malik in 1986 faisalabab test Chirs woakes do today
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్ ,ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఆఖరి రోజు ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా.. టీమ్ఇండియా గెలుపుకు 4 వికెట్లు అవసరం. కాగా.. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో క్రిస్‌వోక్స్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు. అతడి ఎడమ భుజం స్థాన భ్రశమైనట్లు తెలుస్తోంది.
కాగా.. ఆఖరి రోజు అవసరం అయితే అతడు బ్యాటింగ్ చేస్తాడని సీనియర్ ఆటగాడు జో రూట్ వెల్లడించాడు. “వోక్స్ చాలా నొప్పితో బాధపడుతున్నాడు ఇది నిజం. అయితే.. కాలికి ఫ్రాక్చర్ అయిన సరే ఆడిన వారిని(పంత్) చూశాం. ఏ ఆటగాడు అయినా సరే అలాగే ఉంటాడు. వోక్స్ కూడా అదే కోవకు చెందుతాడు. ఇంగ్లాండ్ కోసం అతడు ఏదైనా చేస్తాడు. అవసరం అయితే క్రీజులోకి అడుగుపెడతాడు.” అని జోరూట్ తెలిపాడు.
ENG vs IND : అరుదైన ఘనత సాధించిన సిరాజ్..
కాగా.. ఈ పరిస్థితి 1986లో పైసలాబాద్ టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాడు సలీం మాలిక్ ను గుర్తు చేస్తుంది. ఆ మ్యాచ్‌లో ఎడమచేయి విరిగిపోయినప్పటికి కూడా సలీం బ్యాటింగ్ చేశాడు.
1986లో పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య ఫైసలాబాద్ వేదికగా టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్ పేసర్ మాల్కం మార్షల్ వేసిన బంతి సలీం మాలిక్ ఎడమ చేయిని బలంగా తాకింది. తీవ్రమైన నొప్పితో అతడు విలవిలలాడిపోయాడు. ఆస్పత్రి తీసుకువెళ్లగా అతడి చేయి విరిగిపోయినట్లుగా డాక్టర్లు చెప్పారు. చేతికి కట్టుకుట్టుకుని వచ్చిన సలీం.. పాక్ 9వ వికెట్ పడిన తరువాత క్రీజులోకి వచ్చాడు.
ENG vs IND : ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు? టీమ్ఇండియా అభిమానుల్లో ఆందోళన?
తొలుత ఎడమ చేతితో, ఆ తరువాత కుడి చేత్తో బ్యాటింగ్ చేశాడు. వసీం అక్రమ్‌తో కలిసి చివరి వికెట్‌కు 32 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధించింది. మరి వోక్స్ కూడా ఆఖరి రోజు జట్టుకు కోసం ఇలాగే బ్యాటింగ్ చేస్తాడా లేదో చూడాల్సిందే.